E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : భరణితో బాండింగ్ పై దివ్య తల్లి రియాక్షన్… తెర వెనుక ఇంత కథ నడిచిందా?

Bigg Boss 9 Telugu : భరణితో బాండింగ్ పై దివ్య తల్లి రియాక్షన్… తెర వెనుక ఇంత కథ నడిచిందా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ గురించి ఈ సీజన్లో జరిగినంత చర్చ మరే సీజన్ లో జరగలేదనే చెప్పాలి. ముందుగా భరణి – తనూజా నుంచి మొదలై… భరణి – దివ్యల దగ్గర ఆగింది. వీళ్ళ బాండింగ్ గురించి ఎన్ని విమర్శలు, ఎన్ని గొడవలు.. అసలు లెక్కేలేదు. ముఖ్యంగా దివ్య వల్ల భరణి గేమ్ పాడవుతోందని, ఆమె వచ్చి తనూజా – భరణిలను విడగొట్టింది అని అనని వాళ్ళే లేరేమో. అది చాలదన్నట్టు గత వారం నామినేషన్లలో భరణి ఏకంగా దివ్యాను బాండింగ్ సాకుతోనే నామినేట్ చేశాడు. కానీ తాజాగా దివ్య తల్లి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

భరణి – దివ్య బాండ్ కు ఇదే కారణం

భరణిని దివ్య అన్నయ్యా అంటూ అలా అల్లుకుపోవడానికి గల కారణం ఏంటో ఇన్నాళ్ళూ ఎవ్వరికీ అర్థంకాక జుట్టు పీక్కున్నారు చాలామంది. మరికొంత మంది మాత్రం తనూజా నుంచి భరణిని లాక్కోవడానికే ఆమె అలా చేస్తోందని సరిపెట్టుకున్నారు. కానీ దివ్య అలా బిహేవ్ చేయడానికి వాళ్ళ అమ్మే కారణమట. తాజాగా ఫ్యామిలీ వీక్ లో స్వయంగా ఆవిడే ఈ విషయాన్ని చెప్పింది. దివ్య తల్లి శ్రీలక్ష్మి ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె మాట్లాడుతూ “నా చిన్నప్పుడే మా అన్నయ్య చదువు వల్ల పెరిగిన ప్రెజర్ తో చనిపోయాడు. అప్పుడే నాకు కొత్తగా పెళ్లి అయ్యింది. అదంతా జరిగి 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మా అన్నయ్య నాకు గుర్తొస్తాడు. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ను ఈ ఇంట్లో నేను భరణిలో చూశాను. అయితే దివ్య పిలిస్తే నేను పిలిచినట్టే అనుకుని ఆయనను అన్నయ్య అని పిలవమని చెప్పాను. సడన్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మామయ్య అని పిలవలేదు కదా’ అంటూ ఎమోషనల్ అయ్యింది దివ్య తల్లి. ఈ ట్విస్ట్ రివీల్ అయ్యాక దివ్య ఇదంతా తన తల్లి చెబితేనే చేసిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్.

దువ్వాడ మాధురి చెప్పింది అబద్ధమా ?

Advertisement

అలాగే “బయట వాళ్ళు వచ్చి ఏదో ఒక ఇన్పుట్ ఇచ్చి వెళతారు. అవన్నీ మనసులో పెట్టుకుని మీరు మారిపోవద్దు” అంటూ శ్రీలక్ష్మి హౌస్ మేట్స్ అందరికీ చెప్పినప్పటికీ, భరణికే ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టు అన్పించింది. ఎందుకంటే గత వారమే భరణి తనూజాతో తనకు దివ్యాను దూరంగా ఉండమని చెప్పమన్నాడు. దువ్వాడ మాధురి వెళ్తూ సంజనాతో దివ్యా తల్లి తనకు ఫోన్ చేసి భరణికి దూరంగా ఉండమని చెప్పిందని, ఆ విషయాన్ని సంజన తనకు చెప్పిందని తనూజా దగ్గర వాపోయాడు భరణి. ఇక ఇప్పుడు స్వయంగా దివ్య తల్లే అన్నీ డౌట్స్ కు క్రిస్టల్ క్లియర్ గా వివరణ ఇచ్చింది. మరి దువ్వాడ మాధురి చెప్పింది ఏంటో?

Read Also : 73 : రీతూతో రిలేషన్ పై తల్లి దగ్గర డెమోన్ ఓపెన్… సంజన ఫుల్ హ్యాపీ… దివ్య మదర్ మాస్ ఎంట్రీ

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×