E-Paper
Advertisement

Peddi : చెప్పిన డేట్ కి రామ్ చరణ్ పెద్ది, బుచ్చిబాబు బ్యాకప్ ప్లాన్ ఇదేనా?

Peddi : చెప్పిన డేట్ కి రామ్ చరణ్ పెద్ది, బుచ్చిబాబు బ్యాకప్ ప్లాన్ ఇదేనా?
Advertisement

Peddi : ఈరోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు పెద్దపీట వేస్తూ విపరీతంగా గౌరవించే వాళ్ళు. చాలామంది కూడా ప్రేక్షక దేవుళ్ళు అని ఇప్పటికీ అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోలు వచ్చి అభిమానులను అల్లరి చేయకండి రా, గోల చేయకండి రా, అంటూ రా అనడం మొదలుపెట్టేసారు. సరే ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి అభిమానుల్ని అరేయ్ ఒరేయ్ ఒరేయ్ అన్న పర్వాలేదు. కానీ కొంతమంది ప్రేక్షకులు టైం కి అసలు వేల్యూ లేకుండా పోయింది.

కొన్ని సినిమా రిలీజ్ డేట్ లో విషయంలోనూ, అలానే కొన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విషయంలోనూ చెప్పిన టైంకి రావడం అందరూ పూర్తిగా మానేశారు. ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్ లో విషయానికి వస్తే చెప్పిన టైంకి ఎక్కువ శాతం సినిమాలో రాకుండా వాయిదా పడుతూ ఉంటాయి. అయితే అవి ఎవరూ ఊహించని విధంగా జరిగినా కూడా ముందు నుంచి క్లారిటీ లేకుండా పోయిందా అనేది ఇంకొంతమంది వాదన. అఖండ 2 సినిమాకి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కూడా వాయిదా పడుతున్నట్లు పలు రకాల వార్తలు వచ్చాయి.

చెప్పిన డేట్ కే పెద్ది 

Advertisement

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు అందుతున్న విశ్వసినీయ వర్గాల సమాచారం ప్రకారం ఖచ్చితంగా చెప్పిన డేట్ పెద్ది సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అవసరమైతే ఒక 10 నుంచి 15 రోజులు సెకండ్ యూనిట్ ఏర్పాటు చేసి మరి చెప్పిన టైంకి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ కోసం కాపీ రెడీ 

Advertisement

అయితే ఒక సినిమాకి అద్భుతమైన కథ స్క్రీన్ ప్లే తో పాటు దానిని నడిపించే సంగీతం కూడా చాలా కీలకపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా కొన్ని పాటల వలన సినిమా మీద విపరీతమైన హైప్ వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చికిరి 100 మిలియన్ న్యూస్ పైగా సాధించుకుంది.

ఈ తరుణంలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కోసం ఏఆర్ రెహమాన్ కి కాపీ రెడీ చేసి ఇవ్వడానికి బుచ్చిబాబు చాలా కష్టపడుతున్నాడు. మొత్తానికి చెప్పిన డేట్ కంటే ముందుగానే సినిమా విడుదలయ్యే ప్లాన్ లో ఉన్నాడు బుచ్చిబాబు. చూడడానికి చేతులు కట్టుకుని అమాయకంగా కనిపించినా కూడా సినిమా విషయంలో కాంప్రమైజ్ గాడు అనేది పలు సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది.

Also Read: Sandeep Raj : ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా, హిట్ సినిమా చేసే ఐదేళ్ల ఇంట్లో కూర్చున్నా

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×