E-Paper
Advertisement

Vijay – Sangeetha: విడాకుల వేళ.. విజయ్ పై సంగీత మోపిన 7 అభియోగాలు ఇవే!

Vijay – Sangeetha: విడాకుల వేళ.. విజయ్ పై సంగీత మోపిన 7 అభియోగాలు ఇవే!
Advertisement

Vijay – Sangeetha: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా , దళపతిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు విజయ్ (Vijay ). ఒకవైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాలలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన భార్య సంగీత (Sangeetha ) విజయ్ కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటీషన్ లో తెలుపుతూ విడాకులు కోరడం సంచలనంగా మారింది. 1999 ఆగస్టు 25న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు.. ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. అయితే సినీ నటితో వివాహేతర సంబంధం కారణంగానే విడాకుల కోరినట్లు సంగీత తన పిటీషన్ లో పేర్కొంది. చంగల్పట్టు కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేయగా ..ఏప్రిల్ 20వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు విజయ్ కి సమన్లు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మాత్రం విజయ్ ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే విజయ్ తో విడాకులు కోరుతూ విజయ్ పై సంగీత ఏకంగా ఏడు కీలక అభియోగాలను మోపింది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

1. వివాహేతర సంబంధం:

26 సంవత్సరాలుగా వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న తమ జీవితంలోకి ఒక నటి వచ్చిందని.. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం వల్లే విజయ్ తో జీవితం కొనసాగించడానికి తాను సిద్ధంగా లేను అంటూ తన అభిప్రాయాలను తెలియజేసిందట.

Advertisement

2. నిర్లక్ష్యం & పశ్చాత్తాపం లేదు:

భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. చేసిన తప్పుకు పశ్చాతాపం పొందకపోవడం వల్లే తాను విసిగిపోయానని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారట.

3. తీవ్ర మానసిక వేదన:

ప్రేమించి, పెళ్లి చేసుకున్న తన భర్త.. తన ప్రేమను తనపై చూపించకుండా వేరొక నటిపై చూపిస్తుండడంతో తట్టుకోలేక తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నట్లు సమాచారం.

4. ఆర్థిక ఆంక్షలు:
డబ్బు విషయంలో కూడా తనపై ఆంక్షలు విధిస్తున్నట్లు 7 కీలక అభియోగాలలో ఒకటిగా ఆమె పేర్కొంది.

5. స్వేచ్ఛా హరణం:

తన కదలికలపై నియంత్రణ చూపిస్తాడని, తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడు అంటూ సంగీత పేర్కొన్నట్లు తెలుస్తోంది.

6. వేధింపులు:

మాటలతో నిరంతరం వేధిస్తున్నాడని.. అనవసరమైన మాటలు మాట్లాడి తనను వేదనకు గురి చేస్తున్నాడు అంటూ తెలిపినట్లు సమాచారం.

7. రెండేళ్లుగా వేరుగా నివాసం:

ఇకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ తన భర్త తనతో ఒకే ఇంట్లో ఉండకుండా గత రెండు సంవత్సరాలుగా వేరే నివాసంలో ఉంటున్నారంటూ ఆమె తన అభియోగాలను వివరించిందట. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
మరి ఏప్రిల్ 20 2026న జరగబోయే విచారణలో అసలు ఏం తేలనింది అనే విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ALSO READ:Vijay – Rashmika: విజయ్- రష్మిక ధరించిన నగల బరువు అన్ని కేజీలా.. ఖరీదు తెలిస్తే షాక్!

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×