E-Paper
Advertisement

Vijay – Rashmika: విజయ్- రష్మిక ధరించిన నగల బరువు అన్ని కేజీలా.. ఖరీదు తెలిస్తే షాక్!

Vijay – Rashmika: విజయ్- రష్మిక ధరించిన నగల బరువు అన్ని కేజీలా..  ఖరీదు తెలిస్తే షాక్!
Advertisement

Vijay – Rashmika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘గీతాగోవిందం’ సినిమాతో మొదలైన రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ఒకరి మనసు మరొకరు తెలుసుకొని అప్పటినుంచి ఒకరికొకరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అలా దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు 2026 ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇకపోతే విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయాయి. విడుదలైన 12 గంటల్లోనే రెండున్నర కోటికి పైగా లైక్స్ సంపాదించి వీరికి ఉన్న క్రేజ్ ను నిరూపించాయి.

అందరి చూపు విరోష్ జంట నగలపైనే!

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న పెళ్లి సింపుల్ గా జరిగినా.. చాలా హుందాగా జరిగిందనే చెప్పాలి. కేవలం 100 మంది సన్నిహితులు, అతిధుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం . ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వేసుకున్న దుస్తులే కాదు వారు ధరించిన ఆభరణాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జువెలరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. దక్షిణ సాంప్రదాయాలను పాటిస్తూనే.. ఆధునిక డిజైన్ ని జోడిస్తూ అత్యంత అద్భుతంగా ఈ జువెలరీని తయారు చేయించుకున్నారు. ఇకపోతే ఈ ఫోటోలు బయటకు రావడంతో అందరి దృష్టి ఆ నగలపైనే పడిందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ ధరించిన ఆ నగల ఖరీదు ఎంత? వాటి బరువు ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

ALSO READ:Tarun – Eesha: మళ్లీ దొరికిపోయిన తరుణ్ – ఈషా.. ఇప్పుడైనా బయటపడండ్రా !

విరోష్ జంట ధరించిన నగల బరువు, ఖరీదు ఎంతంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట నగలను హైదరాబాదుకు చెందిన శ్రీ జువెలరీ సంస్థ దాదాపు పది నెలలపాటు కష్టపడి అత్యంత అద్భుతంగా నక్షి డిజైన్తో వీటిని రూపొందించింది. రష్మిక వడ్డానం, మంగళసూత్రం, గాజులు, నెక్లెస్ ఇలా సుమారుగా 11 రకాల నగలను ఆమె తయారు చేయించుకుంది. వీటి బరువు సుమారుగా 1.5 నుండీ 2 కేజీలు ఉంటాయని నేషనల్ మీడియా స్పష్టం చేసింది. వీటి విలువ సుమారుగా 3 నుండి 5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అటు విజయ్ కూడా సుమారుగా అర కేజీకి పైగా బరువైన నగలు ధరించగా.. వీటి విలువ రూ .1నుండి 2 కోట్లు ఉంటాయని స్పష్టం చేసింది. మొత్తానికైతే విలువైన వజ్రాలు , స్పెషల్ డిజైన్ కారణంగానే ధర పెరిగినట్లు సమాచారం. దాదాపు 10 నెలల పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి మరీ డిజైన్ చేయించుకున్న ఈ నగలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.విజయ్ దేవరకొండ ధరించిన ఆభరణాలపై పులులు, ఏనుగులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక రష్మిక ధరించిన ఆభరణాల విషయానికొస్తే.. దక్షిణ భారత ఆలయ శిల్పకలను ప్రతిబింబించేలా నక్షి డిజైన్ రూపంలో వీటిని రూపొందించారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×