E-Paper
Advertisement

Safest Cars: మహీంద్రా To టాటా.. ఇండియాలో అత్యంత సురక్షిమైన కార్లు ఇవే!

Safest Cars: మహీంద్రా To టాటా.. ఇండియాలో అత్యంత సురక్షిమైన కార్లు ఇవే!
Advertisement

Top 5 Safest Cars in India 2026: గత కొద్ది కాలంగా కార్ల కొనుగోలుదారులు భద్రతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.  భారత్ NCAP క్రాష్ టెస్టింగ్ ఫలితాల ఆధారంగా ఏ కారు ఎంత రక్షణ ఇస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్ కార్లను కొనుగోలు చేస్తున్నారు.  ప్రస్తుతం భారత్ NCAP స్కోర్‌ ఆధారంగా దేశీ మార్కెట్ లో టాప్ సేఫ్టీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మహీంద్రా BE 6

ఈ కారు ధర రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.  భారత్ NCAP రేటింగ్ లో సత్తా చాటింది. పెద్దలు, పిల్లల సేఫ్టీలో5-స్టార్ రేటింగ్‌ను పొందింది. క్రాష్ టెస్టింగ్‌ లో ఈ కారు నిర్మాణం బలమైనదిగా తేలింది. ఈ SUV పెద్ద సంఖ్యలో  ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అధునాతన నియంత్రణ వ్యవస్థలతో వస్తుంది.

⦿ టాటా పంచ్

Advertisement

ఈ కారు ధర రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా పంచ్ కాంపాక్ట్ SUV భద్రతలో రారాజుగా నిలిచింది. భారత్ NCAP టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. పెద్దలు, పిల్లల రక్షణలో మంచి పాయింట్స్ సాధించింది.  దీని బాడీ షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు తేలింది. డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో ABS, సీట్ బెల్ట్ రిమైండర్లు లాంటి ముఖ్యమైన ఫీచర్లతో పాటు క్రాష్ టైమ్ లో మంచి సేఫ్టీని అందిస్తుంది.

⦿ టాటా హారియర్ EV

ఈ కారు ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హారియర్ EV 5 స్టార్ భారత్ NCAP రేటింగ్‌ ను సాధించింది. పిల్లలతో పాటు పెద్దల రక్షణలో బలంగా ఉంది. బలమైన ప్లాట్‌ ఫామ్, ఎక్కువ ఎయిర్‌ బ్యాగ్‌లు, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో వచ్చిన దాని విభాగంలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం.

⦿ టయోటా ఇన్నోవా హైక్రాస్

Advertisement

ఈ కారు ధర రూ. 18.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యామిలీ MPVని చూస్తున్న కొనుగోలుదారుల కోసం, ఇన్నోవా హైక్రాస్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మంచి బూట్ స్పేస్ తో పాటు బలమైన క్రాష్ సేఫ్టీని అందిస్తుంది. ఇది భారత్ NCAP టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్‌ ను పొందింది. పెద్దలు, పిల్లల సేఫ్టీలోనూ ఇదే రేటింగ్ పొందింది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX మౌంట్‌ లతో, కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగాఉంటుంది.

⦿ స్కోడా కైలాక్

ఈ కారు ధర రూ.7.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కైలాక్ దేశంలోని అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో మంచి సత్తా చాటింది. పెద్దలు, పిల్లల రక్షణలో 5 స్టార్ రేటింగ్‌ను సంపాదించింది. ప్రామాణిక ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో పాటు స్థిరమైన బాడీ నిర్మాణం భద్రతలో కీలక పాత్ర పోషించింది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తుంది.

Read Also:  టాటా నెక్సాన్ To MG విండ్సర్.. రూ. 20 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×