E-Paper
Advertisement

Olectra Electric Car: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించిన సీఎం, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Olectra Electric Car: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించిన సీఎం, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రేజీ ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీమంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లాంచ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. వెనుక సీట్లో మెగా ఇంజినీరింగ్ సంస్థ, ఈ కారు తయారు చేసిన కంపెనీ అధినేత  మెగా కృష్ణారెడ్డి కూర్చున్నారు.

ఇంతకీ ఏంటీ ‘ఒలెక్ట్రా’ కంపెనీ?

‘ఒలెక్ట్రా’ అనేది ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చాలా మందికి తెలుసు. తెలుగు వ్యక్తి మెగా క్రిష్ణారెడ్డికి చెందిన కంపెనీ ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ప్రాజెక్టులను చేపడుతుంది. కృష్ణారెడ్డికి చెందిన మరో కంపెనీయే ‘ఒలెక్ట్రా’. ఇప్పటికే  చక్కటి ఎలక్ట్రిక్ బస్సును తయారు చేస్తోంది. తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారును తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తో ఆవిష్కరించేలా చేశారు. ప్యూచర్ సిటీ ప్రాంగణంలో మెగా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడంతో.. తెలుగు కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు  సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణతో మెగా సంస్థకు చెందిన ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కారుకు సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ అనేది భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ బస్ తయారీదారులలో ఒకటి. ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్‌లు, ఎలక్ట్రిక్ టిప్పర్లు,ఇతర వాహనాలను తయారుచేస్తుంది, కానీ ప్యాసింజర్ కార్లను తయారు. చేలేదు. కానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఇక బస్సులు, టిప్పర్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఒలెక్ట్రా కంపెనీ గురించి..

Advertisement

⦿ స్థాపన-భాగస్వామ్యం: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 2000లో స్థాపించబడింది. చైనా BYD కంపెనీతో జాయింట్ వెంచర్ లో భాగంగా దీనిని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేశారు. ఇక్కడే ముఖ్యమైన  ఫ్యాక్టరీ ఉంది.

⦿ ఉత్పత్తులు: ఈ కంపెనీ ప్రధానంగా బస్సులు, టిప్పర్లు తయారు చేస్తుంది.  ఈ కంపెనీ నుంచి వచ్చిన eBuzz K7 బస్సు 9 మీటర్ల పొడవు, 31 సీట్లను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ. రేంజ్ లభిస్తుంది. 70 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.  eBuzz K9 బస్సు 12 మీటర్ల పొడవు ఉంటుంది. X2 (ఎయిర్‌పోర్ట్ షటిల్), CX2 (ఇంటర్‌సిటీ కోచ్), V2 (లోకల్ ట్రాన్స్‌పోర్ట్) బస్సులను తయారు చేస్తుంది. బస్సులతో పాటు Meghaetron 28T అనే ఎలక్ట్రిక్ టిప్పర్ ను కూడా తయారు చేసింది. త్వరలోనే ఎలక్ట్రిక్ కార్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

Big Stories

Advertisement
×