E-Paper
Advertisement

షూటింగ్ జరిగే సమయంలో అలా అడిగే సరికి షాక్ అయ్యా.. తిరువీర్

షూటింగ్ జరిగే సమయంలో అలా అడిగే సరికి షాక్ అయ్యా.. తిరువీర్
Advertisement

Thiruveer Actor: తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. ‘మల్లేశం’, ‘జార్జ్ రెడ్డి’, ముఖ్యంగా ‘మసూద’ వంటి చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ, సాధారణ జీవితంలో తనకు ఎదురయ్యే కొన్ని విచిత్రమైన పరిస్థితులను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక నటుడిగా వెండితెరపై కనిపిస్తున్నా, బయట జనం తనను గుర్తుపట్టకపోవడం వెనుక ఉన్న సరదా ఎమోషనల్ కోణాలను ఆయన వివరించారు.

Read also-దివ్వెల మాదురి ఏ సినిమాలో నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూసేయండి..

ప్రయాణంలో ఏం జరిగిందంటే..

Advertisement

ఒకసారి విజయవాడకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను తిరువీర్ గుర్తు చేసుకున్నారు. తన పక్కన కూర్చున్న వ్యక్తి మాటల సందర్భంలో “సినిమా ఇండస్ట్రీనా?” అని అడిగారు. అవునని చెప్పగానే, “ఏం చేస్తుంటావు?” అని ప్రశ్నించారు. ఒకవేళ తాను నటుడినని చెబితే, ఏ సినిమాలు చేశావు? ఎప్పుడు విడుదలయ్యాయి? వంటి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని భావించిన తిరువీర్, సింపుల్‌గా తాను ఒక ‘అసిస్టెంట్ డైరెక్టర్’ అని అబద్ధం చెప్పారు. ఏ సినిమాకు అని అడిగితే ఏదో ఒక సినిమా పేరు చెప్పి ఆ సంభాషణను అక్కడితో ముగించేశానని ఆయన నవ్వుతూ చెప్పారు. అంటే, ఒక నటుడిగా తనను తాను పరిచయం చేసుకోవడం కంటే, తెర వెనుక పని చేసే వ్యక్తిగా చెప్పుకోవడమే ఆయనకు సౌకర్యంగా అనిపించింది.

షూటింగ్ సెట్‌లో..

మరో ఆసక్తికరమైన సంఘటన అనంతపూర్‌లో ‘భగవంతుడు’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. సెట్‌లో తిరువీర్ తన కో-డైరెక్టర్‌తో మాట్లాడుతుండగా, ఒక స్థానిక వ్యక్తి బైక్ పై వచ్చి అక్కడున్న హడావుడిని చూసి.. తిరువీర్‌ను చూస్తూనే “ఇందులో హీరో ఎవరండి?” అని అడిగారు. పక్కనే హీరోగా నటిస్తున్న తిరువీర్ ఉన్నప్పటికీ, ఆయనను గుర్తుపట్టలేక అలా అడగడంతో అక్కడున్న కో-డైరెక్టర్ ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఇలాంటి అనుభవాలు తనకు నిత్యం ఎదురవుతూనే ఉంటాయని తిరువీర్ పేర్కొన్నారు.

Advertisement

Read also-విక్రమ్ సహిదేవ్ ‘అనకాపల్లి’ టీజర్ వచ్చేసింది చూశారా?.. ఎలా ఉందంటే?

‘మసూద’ ఇన్సిడెంట్..

అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ‘మసూద’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం. మసూద సినిమా చేసే సమయంలో అందులో నటించిన ఆ చైల్డ్
ఆర్టిస్ట్‌ తాను హీరో అంటే అసలు నమ్మలేదన్నారు. డ్రైవర్‌వా?” అని అడిగారట. తాను ఆ సినిమాలో మెయిన్ హీరోనని చెప్పినా ఆ వ్యక్తి నమ్మలేదని తిరువీర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా రంగంలో ఎంతటి ప్రతిభ ఉన్నా, గ్లామర్ ప్రపంచానికి దూరంగా, సామాన్యుడిలా కనిపించే తిరువీర్ వ్యక్తిత్వం ఇక్కడ స్పష్టమవుతుంది. తెరపై నటుడిగా మెప్పించినా, నిజ జీవితంలో ఒక సాదాసీదా మనిషిలా కలిసిపోవడమే ఆయన ప్రత్యేకత. ఈ సంఘటనలు వినడానికి సరదాగా ఉన్నప్పటికీ, ఒక నటుడు తన గుర్తింపు కోసం సామాన్య ప్రజల్లో ఇంకా ఎంత చేరువవ్వాలో తెలియజేస్తాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×