E-Paper
Advertisement

దివ్వెల మాదురి ఏ సినిమాలో నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూసేయండి..

దివ్వెల మాదురి ఏ సినిమాలో నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూసేయండి..
Advertisement

Duvvada Madhuri: బిగ్ టీవీ ‘కిస్సిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో దువ్వాడ మాధురి తన ప్రస్తుత సినిమా ప్రాజెక్టుల గురించి, చిత్ర పరిశ్రమలో తన అడుగుల గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన దువ్వాడ మాధురి ఇప్పుడు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తను ఒక క్రేజీ ప్రాజెక్టులో భాగమైనట్లు వెల్లడించారు. అందులో తను క్యారక్టర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పుకోచ్చారు.

Read also-దివ్వెల మాధురి నెలకు కొనే గోల్డ్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు.. అసలు ఎంతుందంటే?

సినిమా వివరాలు

Advertisement

ఆమె నటిస్తున్న తాజా చిత్రానికి “చీన్ టపాక్ డుమ్ డుమ్” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో తాను ఒక కీలకమైన మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషించినట్లు మాధురి గారు తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మే లేదా జూన్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో తను నెగిటివ్ రోల్ చేస్తున్నానని.. అలాంటి రోల్స్ అంటే తనకు చాల ఇష్టమని ఆమె చెప్పుకోచ్చారు. ఆ పాత్ర చేయడానికి అసలు మేకప్ కూడా వేసుకోలేదన్నారు. నేచురల్ గా ఎలా ఉన్నానో అలాగే సినిమాలో కూడా కనిపించానన్నారు.

Read also-Dhurandhar 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన రణ్ వీర్ సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

షూటింగ్ అనుభవాలు

Advertisement

రాజకీయాలు, వ్యాపార రంగాల్లో తలపండినప్పటికీ, కెమెరా ముందు నటించడం తనకు కొత్త అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. షూటింగ్ మొదటి రోజే డైరెక్టర్ ఏకంగా 200 మంది జనం మధ్యలో సీన్ పెట్టారని, అప్పుడు కొంచెం భయం వేసినా ధైర్యంగా తన పాత్రను పూర్తి చేశానని వివరించారు. మొదటి నుంచీ వ్యాపారవేత్తగా (పెట్రోల్ బంక్స్, రియల్ ఎస్టేట్) స్థిరపడిన ఆమె, ఇప్పుడు కళా రంగంలోకి రావడం తనకెంతో ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తన వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయని, త్వరలోనే వైజాగ్ వంటి నగరాల్లో కూడా తన బ్రాంచ్‌లను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలోనే సినిమాలకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అండదండలతో పాటు తనదైన ధైర్యంతో ముందుకు సాగుతున్న మాధురి, ఈ సినిమాతో నటిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో వేచి చూడాలి. ఈ సినిమాలో మాదురి ఎలా ఉండ బోతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×