E-Paper
Advertisement

స్వప్నశాస్త్రం ప్రకారం కలలు నిజమవుతాయా..?

స్వప్నశాస్త్రం ప్రకారం కలలు నిజమవుతాయా..?
Advertisement

Dreams: స్వప్న శాస్త్రం ప్రకారం కలలు నిజమవుతాయా..? నిజమే అయితే ఎప్పుడు ఏ టైంలో వచ్చిన కలలు నిజం అవుతాయి…? కలల గురించి అసలు స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది. జరిగే విషయాలను స్వప్నం ద్వారా ఎవరు తెలియజేస్తారు..? ఇలాంటి ఆసక్తికరమై విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం (Dream Science) ప్రకారం మనం కనే కలలకు రకరకాల అర్థాలు, అంతరార్థాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కలలు నిజమవుతాయా లేదా అనే అంశంపై స్వప్న శాస్త్రం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కలలు కనే సమయం: స్వప్న శాస్త్రం ప్రకారం కలలు నిజమవ్వడం అనేది మనం ఆ కల కన్న సమయంపై ఆధారపడి ఉంటుందట. బ్రహ్మ ముహూర్తంలో  (తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర గంటల సమయంలో) వచ్చే కలలు చాలా వరకు నిజమవుతాయని, అవి త్వరగా ఫలిస్తాయని నమ్ముతారట. ఇక  రాత్రి మొదటి భాగ సమయంలో వచ్చే కలలు నిజమవ్వడానికి ఏడాది పట్టవచ్చు లేదా అసలు నిజం కాకపోవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాత్రి రెండో భాగం తర్వాత వచ్చే కలలు ఆరు నెలల లోపు ఫలిస్తాయని అది కూడా కొందరి విషయాల్లో ఫలించకపోవచ్చని చెప్తున్నారు పండితులు.

ఏ రకమైన కలలు ఫలిస్తాయి?: కలలు పడే సమయంతో అవి ఏ రకమైన కలలో కూడా చూసుకోవాలని అప్పుడే అవి నిజం అవుతాయా లేదా అన్న విషయం అర్థం అవుతుందంటున్నారు. గాఢ నిద్రలో ఉండి, నిద్రలేవగానే స్పష్టంగా గుర్తుండే కలలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందట. ఇక ఒకే కల పదే పదే వస్తుంటే.. అది మీ జీవితంలో జరగబోయే ఏదో ఒక మార్పుకు సంకేతమని శాస్త్రం చెబుతోందట. నదులు, సముద్రాలు, దేవాలయాలు లేదా దేవుళ్లు కలలో కనిపిస్తే అవి శుభ సూచకాలని భావించాలట.

Advertisement

శాస్త్రీయ దృక్పథం (Psychology): శాస్త్రవేత్తల ప్రకారం, కలలు అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్ (అంతర్మథనం) ప్రతిబింబాలట. మనం రోజంతా దేని గురించి ఆలోచిస్తామో, ఏవైనా భయాలు లేదా కోరికలు ఉంటే అవి కలల రూపంలో వస్తాయట. శారీరక అనారోగ్యం లేదా ఒత్తిడి వల్ల కూడా కలలు రావచ్చని పరిశోధకులు చెప్తున్నారు.

స్వప్న శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని కలలు నిజం కావాలని లేదు. కొన్ని కలలు కేవలం మన మెదడులోని ఆలోచనల ప్రతిబింబాలుగా వస్తాయని.. మంచి కలలు వస్తే ఉత్సాహంగా ఉండమని.. ఒకవేళ భయపెట్టే కలలు వస్తే వాటిని వదిలేసి ప్రశాంతంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు పండితులు.

 ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నరదిష్టితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ రెమెడీస్ పాటించాలట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×