E-Paper
Advertisement

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఫైనల్ డ్యూరేషన్ ఇదే, కం బ్యాక్ ఇస్తాడా?

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఫైనల్ డ్యూరేషన్ ఇదే, కం బ్యాక్ ఇస్తాడా?
Advertisement

Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ ఊహించిన స్థాయి సక్సెస్ సినిమా రాలేదు. ఆంధ్ర కింగ్ తాలుక సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చాలామంది విపరీతంగా నమ్ముతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ మరియు ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఏకంగా నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఈ నాలుగు పాటలు కూడా మంచి టాక్ సాధించుకున్నాయి. మొదటి పాటను రామ్ రచించాడు. రామ్ సాహిత్యం రాయడం అనేది మొదటిసారి. సాహిత్యం గురించి మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో ఒక హీరో సాహిత్యాన్ని రాశాడు అంటే అది చాలా గొప్ప విషయం. రామ్ రాసిన విధానం కూడా బాగా ఆకట్టుకుంది.

ఫైనల్ డ్యూరేషన్ ఇదే 

Advertisement

ఈ రోజుల్లో సినిమా డ్యూరేషన్ కూడా కొంత మేరకు సినిమా సక్సెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. అయితే సినిమాని ఆసక్తికరంగా మలిస్తే పరవాలేదు గానీ, ఆసక్తి లేకుండా సినిమా నిడివి ఎక్కువ ఉంది అంటే ల్యాగ్ అని పేరు పెట్టి మరి ట్రోల్ చేస్తారు.

ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే దీనికి యు ఎన్ ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా మొత్తం 166 నిమిషాల 26 సెకండ్లు ఉండబోతుంది. దీనిని బట్టి ఈ సినిమా నిడివి రెండు గంటల 46 నిమిషాలు. సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగితే ఇది కొంచెం సేఫ్ డ్యూరేషన్ అని చెప్పాలి.

ఫ్యాన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 

Advertisement

ఇకపోతే రామ్ అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా నిరాశలోనే ఉన్నారు. ఎందుకంటే చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తాడు కావలసినంత టాలెంట్ ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చేస్తున్న సినిమాలు మాత్రం వర్కౌట్ కావడం లేదు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ రామ్ కి ఉంది. రామ్ కమర్షియల్ సినిమాలను ఎలా అయితే కొంతమంది ఇష్టపడతారు రామ్ చేసిన లవ్ స్టోరీ ని కూడా ఇష్టపడే అభిమానులు ఉన్నారు.

మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో రామ్ ఖచ్చితంగా కం బ్యాక్ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమాకి సంబంధించిన వైబ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో నవంబర్ 27న తెలుస్తుంది.

Also Read: INOX : మూతపడుతున్న థియేటర్స్ , సినిమాలకు ప్రేక్షకుడి పూర్తిగా దూరం

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×