E-Paper
Advertisement

INOX : మూతపడుతున్న థియేటర్స్ , సినిమాలకు ప్రేక్షకుడి పూర్తిగా దూరం

INOX : మూతపడుతున్న థియేటర్స్ , సినిమాలకు ప్రేక్షకుడి పూర్తిగా దూరం
Advertisement

INOX : థియేటర్స్ అన్నీ కూడా కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి అని గత కొన్ని రోజులుగా మనం వార్తలు వింటూనే వస్తున్నాం. సినిమా థియేటర్లు నడుపుతున్న వాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాం. అసలు ఒకప్పుడు సినిమా అంటేనే ఒక రకమైన వైబ్ ఉండేది. థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నాం అంటే ఒక రకమైన ఉత్సాహం ఉండేది. ఈరోజుల్లో థియేటర్కు ఆడియన్ రావడం అనేది గగనం అయిపోయింది.

అలా అని చెప్పి పూర్తిగా మానేశారు అని చెప్పలేము. మంచి సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి బ్రహ్మరథం పడతారు. చాలా చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ సాధించాయంటే కారణం ఆ సినిమాలకు మంచి టాక్ రావడం. ఒక గుర్తింపు ఉన్న హీరో కూడా ఈరోజు సినిమా చేస్తే ఫస్ట్ షో కి థియేటర్లో నిండని పరిస్థితి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల షోలు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి.

మూతపడుతున్న థియేటర్స్ 

Advertisement

విజయవాడలో కొన్ని థియేటర్స్ మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి కారణం ప్రేక్షకులు సరిగ్గా థియేటర్ కు రాకపోవడమే. ఇక్కడి ధరలు ఆకాశాన్ని అంటడమే. సినిమా ఈరోజు ప్రేక్షకుడి ఇంటికి వచ్చేస్తుంది. ఈ తరుణంలో సినిమాలు వెతుక్కుని మరి థియేటర్ కి వెళ్ళాలి అంటే దానిమీద విపరీతమైన ఆసక్తి ఉండాలి.

విజయవాడ, గాంధీనగర్, ఊర్వశి ఐనాక్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 26 కు మూతపడనున్నాయి. ఐనాక్స్ వాళ్ళు లీజు వదిలేసారు. తరుణంలో వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే దానిని రన్ చేసే ఆలోచనలో ఉన్నారు. లేకపోతే అవి కంప్లీట్ గా మూత పడిపోయినట్లే. ప్రస్తుతం థియేటర్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మూత పడిపోతున్నాయి.

మార్పు జరగాలి? 

Advertisement

పాత తరంలో హీరోలు సంవత్సరానికి కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఒక సినిమా ప్లాప్ అయింది అంటే ఇంకో మూడు నెలల్లో సక్సెస్ఫుల్ సినిమా వస్తాది అనే ఉత్సాహంతో ప్రేక్షకుడి థియేటర్ వరకు అప్పట్లో వెళ్లేవాళ్ళు.

టీవీలు కూడా ఆ రోజుల్లో అరుదుగా ఉండేది కాబట్టి వాళ్లకుండే ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా అనిపించేది. తక్కువ ఖర్చుతో మూడు గంటల పాటు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, అలానే ఉత్సాహాన్ని ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఏకైక ప్లేస్ సినిమా అని అప్పట్లో ఫీల్ అయ్యేవాళ్ళు.

ఇప్పుడు ఏకంగా చాలా ఎంటర్టైన్మెంట్ సోలు వచ్చేసాయి. ఎంటర్టైన్మెంట్ ఈరోజు మన పాకెట్ లో ఉంది. ఈ తరుణంలో మన జేబులో డబ్బులు పెట్టి థియేటర్ కు వెళ్లడానికి ఎవరు అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్లనే ఇలా థియేటర్లు మూత పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగు హీరోలు మళ్లీ స్పీడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు తరచు దగ్గరగా ఉంటే సినిమాలకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది.

Also Read: Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్ , ఇంకా ఏ రికార్డ్స్ ఉండవు

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×