E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో చివరి కెప్టెన్ గా డిమాన్ పవన్.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో చివరి కెప్టెన్ గా డిమాన్ పవన్.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది..

Bigg Boss 9 Telugu : ప్రస్తుతం జనాల నోటా వినిపించే ఒకే ఒక్క మాట బిగ్ బాస్.. సెప్టెంబర్ 7 న మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో పూర్తి కావొస్తుంది.. ఈ క్రమంలో ఆడియన్స్ కు మరింత క్యూరియాసిటీ పెంచేందుకు రోజుకోకరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తున్నారు. నిన్న హౌస్ లో వచ్చిన సోహెల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత శోభా శెట్టి, యావర్ కూడా ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఈ వారం బిగ్ బాస్ కు చివరి కెప్టెన్ ఎవరు అవుతారో అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. హౌస్మెట్స్ కూడా నువ్వా నేనా అని పోటీ పడి ముందుకు సాగుతున్నారు. అయితే 13 వ హౌస్ కు కెప్టెన్ గా నిలవాలని అందరు గట్టి పోటీనిచ్చారు. అయితే ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9లో చివరి కెప్టెన్సీ కంటెండర్ రేసులో డీమాన్ పవన్, కళ్యాణ్, రీతు, సంజన, దివ్య, ఇమ్మాన్యుయెల్ నిలిచారు.. మరి వీరిలో చివరి కెప్టెన్ గా ఎవరు నిలుస్తారో ఒకసారి చూద్దాం..

చివరి కెప్టెన్సీ రేసులో నిలిచింది ఎవరు..?

తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈవారం పాత కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. దాంతో ఈ వీక్ లోని ప్రతి ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లను హౌస్ లో ఉన్న వారితో కాకుండా ఆల్రెడీ ముందు సీజన్లలో కెప్టెన్ గా నిలిచిన యోధులను బిగ్ బాస్ హౌస్ లో కి పంపించాడు.. అలా హౌస్ లోకి వచ్చిన ప్రియాంక, మానస్, హారిక, ప్రేరణ, శోభా శెట్టి, యావర్, సోహైల్ వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించారు.. అంతేకాదు కంటెస్టెంట్స్ తో పోటీ పడ్డారు. ఎవరు ఎవరితో పోటీ పడ్డారంటే.. ముందుగా గౌతమ్ హౌస్ లోకి వచ్చి భరణి తో గేమ్ ఆడుతాడు, ఈ గేమ్ లో భరణి ఓడిపోతాడు.. ఆ తర్వాత ప్రియాంక జైన్ తో కళ్యాణ్ పడాల గేమ్ ఆడి గెలుస్తాడు.. అతను విన్నర్ గా నిలుస్తాడు. అలేఖ్య హారిక హౌస్ లోకి వచ్చి సుమన్ శెట్టి తో,అదే విధంగా సీజన్ 8 కంటెస్టెంట్ ప్రేరణ తనూజ తో గేమ్స్ ఆడుతారు. సుమన్ శెట్టి, తనూజ ఓడిపోయి కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకుంటారు. ప్రిన్స్ యావర్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అతనితో ఇమ్మానుయేల్ తో పోటీ పడుతాడు. ఇందులో ఇమ్మానుయేల్ గెలిచి మూడవ కెప్టెన్సీ పోటీ దారుడు అవుతాడు. అదే విధంగా శోభ శెట్టి తో దివ్య, సోహైల్ తో సంజన, రీతూ చౌదరి తలపడతారు. దివ్య, సంజన, రీతూ చౌదరి కెప్టెన్సీ పోటీ దారులు అవుతారు. వీరిలో ఎవరు చివరి వారం కెప్టెన్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Also Read : మొన్న అభిమానిపై బాలయ్య అందుకే సీరియస్ అయ్యాడా? అసలు నిజం ఇది..

బిగ్ బాస్ సీజన్ 9 చివరి కెప్టెన్ గా డిమాన్..

చివరి కెప్టెన్సీ రేసు రసవత్తరంగా సాగింది..పాత సీజన్ యోధులు ప్రస్తుతం హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పోటీ పడ్డారు.. వీరిలో కొంతమంది కెప్టెన్సీ పోటీ దారులుగా నిలిచారు. వీరిలో వీరికి మళ్లీ బిగ్ బాస్ పోటీ పెట్టగా.. అందులో డిమాన్ పవన్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది.. ఇవాళ ఎపిసోడ్ లో దీని గురించి తెలియనుంది. పవన్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లలో ఒకడు. కొన్ని వారాలుగా పవన్ ప్రతి టాస్క్ లోనూ విజ్రూంభిస్తున్నాడు. అయితే ఈ వారం చివరి కెప్టెన్ గా ఇమ్మానుయేల్ అవుతారని అందరూ అనుకున్నారు.. కానీ అంచనా తప్పు అని పవన్ నిరూపించి హౌస్ కు చివరి కెప్టెన్ గా నిలిచారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న పవన్ కెప్టెన్ అవడంతో సేవ్ అయ్యాడు. మరి డేంజర్ లో ఉన్న సంజన, దివ్య, రీతూలలో ఎవరో ఒకరు మాత్రం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే గతవారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×