E-Paper
Advertisement

Chaitanya Jonnalagadda: 45 ఏళ్లు చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..?

Chaitanya Jonnalagadda: 45 ఏళ్లు చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే..?
Advertisement

Chaitanya Jonnalagadda: టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్స్ అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో, డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, వేణు ఊడుగుల,రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో దివ్యాంగుడు వెంకన్న పాత్ర చైతన్య జొన్నలగడ్డ నటించారు. ఆయన అద్భుతమైన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా చైతన్య తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 45 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పారు. దాంతో ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆ కారణాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

చైతన్య పెళ్లి అందుకే చేసుకోలేదా..?

ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాల కన్నా చిన్న సినిమాలకే మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో హీరోయిన్ తండ్రిగా విలన్ గా నటించిన చైతన్య జొన్నలగడ్డ నటన గురించి సోషల్ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మూవీ అయిన చాలా బాగా నటించాడని అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈయన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. తాజాగా ఆయన ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. గత ఏడాది వీడియో అయినా కూడా అందులో తన పెళ్లి గురించి చెప్పడంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. అందులో ఆయన మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. నాకు నచ్చితే డేట్ కు వెళ్తాను.. ఆ అవసరాలు తీరుతుంటే ఇక పెళ్లేందుకు అని ఇండైరెక్ట్ గా పెళ్లితో పనిలేదు అని ఓపెన్ గా చెప్పేశాడు. దాంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూ.. బర్త్ డే సర్ప్రైజ్  రెడీ..

సిద్దుతో కలిసి ఆ పాత్రలో నటిస్తాను.. 

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కు చైతన్య జొన్నలగడ్డ బ్రదర్ అన్న విషయం తెలిసిందే. ఈయన నటించిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. ఆయనకు మొదట విక్టరీ వెంకటేష్ అంటే చాలా ఇష్టమని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అయితే ఆయనతో నటించే అవకాశం వస్తే నటిస్తారని యాంకర్ అడగ్గా.. ఎందుకు నటించను నా ఫేవరెట్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత సిద్దుతో మీరు ఎలాంటి రోల్ చేయాలని అనుకుంటున్నారు అని అడిగారు.. రియల్ లైఫ్ లో ఎలాగైతే బ్రదర్ గా ఉన్నానో అలాంటి పాత్రలో సినిమా వస్తే కచ్చితంగా చేస్తాను. నాచురల్ గా ఉంటుంది కాబట్టి ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. మరి ఏ డైరెక్టర్ అయినా సిద్దుతో కలిసి నటించే అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×