E-Paper
Advertisement

Jailer 2: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూ.. బర్త్ డే సర్ప్రైజ్  రెడీ..

Jailer 2: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూ.. బర్త్ డే సర్ప్రైజ్  రెడీ..
Advertisement

Jailer 2: తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇటీవల రజినీ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. రీసెంట్గా కూలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఒకవైపు మిక్స్డ్ టాక్ అని అందుకున్న మరోవైపు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమా మరో ఎత్తనే చెప్పాలి.. ప్రస్తుతం సూపర్ స్టార్ గతంలో ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. రజినీ బర్త్ డే సందర్బంగా గ్లింప్స్ వీడియో రాబోతుందని టాక్.. దీని గురించి వివరాలు తెలుసుకుందాం..

సూపర్ స్టార్ బర్త్ డే సర్ప్రైజ్ రెడీ…

75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రేక్షకులను మెల్లించాలనే ఉద్దేశంతో తన బాడీ సపోర్ట్ చేయకపోయినా కూడా సోలో హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూస్తుండటం మామూలు విషయం కాదు. తన చివరి శ్వాస విడిచే వరకు అభిమానులకు తన సినిమాలతో అలరిస్తాను అని రజిని చాలా సందర్భాల్లో అన్నారు.. ఈ సంవత్సరం వచ్చిన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు అనుకున్నప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో రజనీకాంత్ అభిమానులు చాలా వరకు నిరాశ పడుతున్నారు. ప్రస్తుతం జైలర్ 2 లో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ మీద షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 12 న రజినీ కాంత్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం నుంచి బర్త్ డే సర్ప్రైజ్ గా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చెయ్యబోతున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మూవీలో రజనీకాంత్ ఎలా ఉండబోతాడు చూడాలని అభిమానులు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు..

Advertisement

Also Read : బిగ్ బాస్ కు రికార్డు బ్రేక్ రేటింగ్.. నాలుగు సీజన్ల తర్వాత హైయెస్ట్ వీకెండ్ రేటింగ్..

జైలర్ మూవీ..

గతంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ జైలర్ థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. భారీ విజయం సాధించడం సహా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ కి తొలి 1000 కోట్ల సినిమా గా `జైలర్ 2` రికార్డు సృష్టించడం ఖాయమంటూ అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.. ఇక దర్శకుడు నెల్సన్ ఎంత మాత్రం కంగారు పడకుండా పని చేస్తున్నాడు. రజనీ అభిమానులు అంచనాలకు మించే ఉంటుందంటూ గతంలోనే ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇందులో ఎస్. జె సూర్య, సురజ్ వెంజారాముదు, రమ్య కృష్ణ, యోగి బాబు, మిర్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ను అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. కానీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×