E-Paper
Advertisement

నాగ్ 100 వ సినిమా.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న మన్మథుడు!

నాగ్ 100 వ సినిమా.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న మన్మథుడు!
Advertisement

Nagarjuna100: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన కెరీర్ లో 100వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో నాగార్జున ఎంతో బిజీగా ఉన్నారు. నాగార్జున సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఈ సినిమా కోసం తమిళ దర్శకుడు రా కార్తీక్ రంగంలోకి దిగారు . చాలా సైలెంట్ గా నాగార్జున ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం మాత్రం బయటకు రాలేదు ఈ నేపథ్యంలోని ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగార్జున కోసం ముగ్గురు హీరోయిన్లు..

ఈ సినిమా లాటరీ కింగ్(Lottery King) అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది. గతంలో నయనతార ,అనుష్క ఈ సినిమాలో భాగం కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి టబు(Tabu) నటించబోతున్నట్లు నాగార్జున చెప్పకనే చెప్పేశారు.

నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్..

Advertisement

ఇక నాగార్జున మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరికి హీరోయిన్లు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుంది. కొద్దికొద్ది రోజులుగా ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఐశ్వర్య రాజేష్ తో పాటు సుస్మిత భట్(Susmitha Bhatt) కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు నాగార్జునతో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి నాగార్జున 100 వ సినిమాలో ఈ ముగ్గురు నటించబోతున్నట్టు వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగార్జున..

Advertisement

ఇక ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ సినిమాను స్వయంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి వివరాలను చిత్ర బృందం అధికారకంగా వెల్లడించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన పార్ట్ 3 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇదివరకే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.. ఇలా వరుస సినిమాలతో పాటు నాగార్జున మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారు.

Also Read: అఖిల్ ‘లెనిన్’సినిమాకు తప్పని ‘పెద్ది’ తిప్పలు.. అక్కినేని హీరో మళ్ళీ తప్పుకోవాల్సిందేనా?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×