E-Paper
Advertisement

వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?

వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?
Advertisement

Travel to Bhutan in 2026: వేసవిలో భూటాన్ పర్యటన జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది.  జూన్ నుంచి ఆగస్టు వరకు అక్కడ వర్షాకాలం ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి. ఉదయాన్నే వెదర్ చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో కొండలు, లోయలు, వరి పొలాలు పచ్చగా అందంగా కనిపిస్తాయి.

తక్కువ ఉష్ణోగ్రతలు

భూటాన్ లో ఎండలు చాలా తక్కువగా ఉంటాయి. అస్సలు ఇబ్బంది పెట్టవు. థింపు, పారో లాంటి ఎత్తైన ప్రదేశాల్లో 15–25°C ఉష్ణోగ్రత ఉంటుంది. పునాఖా లాంటి పల్లపు ప్రాంతాల్లో 22–30°C వరకు వేడి ఉంటుంది. ఎక్కువగా తేమగా ఉంటుంది. వర్షం కారణంగా ప్రకృతి మరింత తాజాగా కనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడే అవకాశమూ ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా టైగర్స్ నెస్ట్ వంటి ప్రదేశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు టూర్ గౌడ్స్.

భూటాన్ కు ఎలా వెళ్లాలంటే?

Advertisement

భారత్ నుంచి భూటాన్‌ కు వెళ్లడం చాలా సులభం. భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‌ పోర్ట్, ఓటర్ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరికి రోజుకురూ.1,200 ఛార్జ్ చేస్తారు. విమాన ప్రయాణం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇండియా నుంచి భూటాన్ లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఒకటే ఉంటుంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి ఢిల్లీ, కోల్‌ కతా మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ప్రయాణ సమయం సుమారు 6–10 గంటలు పడుతుంది. రానుపోను టికెట్ ధర రూ. 20,000 నుంచి  రూ. 40,000 వరకు ఉంటుంది.   రోడ్డుమార్గం ఉన్నప్పటికీ, కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది.  బెంగాల్‌లోని జైగావ్ ద్వారా ఫుయెంటోలింగ్ సరిహద్దు దాటి భూటాన్‌ లోకి అడుగు పెట్టాలి. అక్కడి నుంచి థింఫు లేదంటే పారోకు 5–7 గంటలు ప్రయాణించాలి. వర్షాకాలంలో ఈ మార్గం అంతగా సౌకర్యవంతంగా ఉండవు.

వారం రోజుల టూర్ ప్లాన్ చేయడం మంచిది!

మొదటిసారి వెళ్లేవారు 5–7 రోజుల పర్యటన ప్లాన్ చేసుకోవడం మంచిది. పారోలో టైగర్స్ నెస్ట్ మఠానికి తప్పకుండా వెళ్లాలి. థింఫులో బుద్ధ డోర్డెన్మా విగ్రహం, తాషిచో జోంగ్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. పునాఖాలో బ్యూటీఫుల్ పునాఖా జోంగ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. థింఫు నుంచి పునాఖాకు వెళ్తూ దోచులా పాస్ దగ్గర 108 చోర్టెన్‌ లు, హిమాలయాల మరింత అందాలు కనిపిస్తాయి.

ఎంత ఖర్చు అవుతుంది అంటే?

Advertisement

ఇక భూటాన్ వారం రోజుల పర్యటనకు సంబంధించి ఒక్కొక్కరికి సుమారు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చవుతుంది. ఇందులో విమాన టికెట్లు, హోటల్, భోజనం, రవాణా, గైడ్ ఖర్చులు ఉంటాయి. గ్రూప్‌ గా వెళ్తే ఖర్చు కొంత తగ్గుతుంది. వేసవిలో హోటల్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.

Read Also: ఏనుగుకు గులాబీ రంగు.. ఇండియాలో విదేశీ ఫొటోగ్రాఫర్ చేసిన పనికి అంత షాక్!

Related News

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×