E-Paper
Advertisement

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఆటో రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న ఆటో ఎల్పీజీ కొరతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కి ఆయన ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల రాష్ట్రంలోని సుమారు లక్షకు పైగా ఆటో రిక్షా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆయన లేఖలో వివరించారు.

తెలంగాణలో సుమారు 1.00 లక్ష ఎల్పీజీ ఆటో రిక్షాలు నడుస్తున్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ పంపిణీ నెట్‌వర్క్‌లో ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, HPCL, BPCL వాటా కేవలం 20 శాతం (33 అవుట్‌లెట్లు) మాత్రమే కాగా, ప్రైవేట్ ఆపరేటర్ల వాటా 80 శాతం (110 అవుట్‌లెట్లు) గా ఉంది. ప్రస్తుత సరఫరా ఆంక్షల వల్ల రోజుకు దాదాపు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీ కొరత ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. దీనివల్ల మెజారిటీ ప్రైవేట్ అవుట్‌లెట్లు మూతపడటంతో ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ అయిన టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు తమ అవసరాల్లో 80 శాతం సరఫరాను BPCL, HPCL నుండే పొందుతాయన్నారు. ప్రస్తుతం ఆ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలు సాగించడం కష్టతరంగా మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు ధరల విషయంలో కూడా భారీ వ్యత్యాసం ఉందని ఆయన ఎత్తిచూపారు. ప్రభుత్వ రంగ అవుట్‌లెట్లలో లీటర్ ఎల్పీజీ ధర రూ. 75 ఉండగా, ప్రైవేట్ సంస్థలు రూ. 93 కు విక్రయిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

`ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తన లేఖలో ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ప్రభుత్వ రంగ సంస్థలైన‌ IOCL, BPCL , HPCL అవుట్‌లెట్లలో ఆటో ఎల్పీజీ లభ్యతను పెంచాల‌ని కోరారు. ప్రైవేట్ పంపిణీ సంస్థలకు ఎదురవుతున్న కొరతను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాల‌న్నారు. సంక్షోభ సమయాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు చేపట్టాల‌ని లేఖ‌లో కోరారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ప్రజా రవాణా సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని, వేలాది మంది ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: నేలపాలైన పంటలు.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×