E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జస్ట్ 10 నిమిషాల్లో.. నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోండిలా!

జస్ట్ 10 నిమిషాల్లో.. నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోండిలా!
Advertisement

10-Min Electric Cycle Conversion: మీ ఇంట్లో ఉన్న సాధారణ సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు చాలా సింపుల్. జస్ట్ 10 నిమిషాల్లోనే సైకిల్ ను కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మార్కెట్‌ లోకి వచ్చిన కొత్త కన్వర్షన్ కిట్లతో సైకిల్‌ ను ఈ బైక్‌ గా మార్చుకోవచ్చు.

సాధారణ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చడం ఎలా?

ఇటీవల జీబూస్ట్ అనే కంపెనీ కొత్త ఈ బైక్ కన్వర్షన్ కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్ సాయంతో సాధారణ సైకిల్‌ ను ఎలక్ట్రిక్ సైకిల్‌ గా మార్చుకోవచ్చు. ఈ కన్వర్షన్ కు ఎక్కువ టైమ్ పట్టదు. సుమారు 10 నిమిషాల్లోనే ఇన్‌స్టాలేషన్ పూర్తవుతుంది.  జీబూస్ట్ కంపెనీ విడుదల చేసిన V8 ఈ-బైక్ కన్వర్షన్ కిట్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మారుతాయి. 250 Wh బ్యాటరీ ప్యాక్ ధర దాదాపు రూ. 91,000 ఉంటుంది. 375 Wh వేరియంట్ ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఉంటుంది. అలాగే 453 Wh బ్యాటరీ ప్యాక్ ధర దాదాపు రూ. 1.16 లక్షల వరకు ఉంటుంది.

సింపుల్ డిజైన్.. ఈజీ ఇన్ స్టాలేషన్

Advertisement

మార్కెట్‌లో ఇప్పటికే చాలా రకాల కన్వర్షన్ కిట్లు ఉన్నప్పటికీ, ఈ V8 కిట్ ధర కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు. అయితే, దీని డిజైన్ చాలా సింపుల్‌ గా, తేలికగా ఉండటం వల్ల ఎవరైనా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నికల్ నైపుణ్యం లేకపోయినా కూడా దీన్ని అమర్చడం కష్టం కాదు.

రేంజ్ ఎలా ఉంటుందంటే?

ఈ కిట్‌ లో బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా రేంజ్ ఉంటుంది. 250 Wh బ్యాటరీతో సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 375 Wh బ్యాటరీ ఉంటే సుమారు 70 నుంచి 73 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. పెద్ద 453 Wh బ్యాటరీ దాదాపు 90 కిలో మీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.  రోజువారీ ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కిట్ సుమారు 900 వాట్ల అవు ట్‌పుట్ ఇస్తుంది. సిటీ రోడ్ల మీద సింపుల్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆఫ్ రోడ్, గతుకుల మార్గాల్లో వెళ్లేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే, ఈ కిట్ ను సిటీ ప్రయాణాల కోసం డిజైన్ చేయబడింది.

భారత్ లో బోలెడు కన్వర్షన్ కిట్లు

Advertisement

భారత్ లో తక్కువ ధరలో ఇలాంటి కన్వర్షన్ కిట్లు బోలెడు లభిస్తున్నాయి. అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా సరైన కిట్‌ను తీసుకోవచ్చు.ఈ కన్వర్షన్ కిట్లు సైకిల్ వినియోగాన్ని మరింత సులభం, వేగవంతం, మోడ్రన్ గా మార్చుతాయి. ఫ్యూయెల్ ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

Read Also: ట్యాంక్ ఫుల్ కాగానే పెట్రోల్ ఆటోమేటిక్ ఆగిపోతుంది.. ఎలాగో తెలుసా?

Related News

E20 పెట్రోల్‌ పై కొత్త వివాదం.. చీమల కథలో నిజమెంత?

70/30 బ్రేక్ రూల్.. సేఫ్ రైడింగ్‌ కోసం ప్రతి బైక్ రైడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

Big Stories

×