E-Paper
Advertisement

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!
Advertisement

National film Awards:సినీ సెలబ్రిటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన నేడు ఘనంగా జరగనుంది. భారతీయ చలనచిత్ర రంగంలో విశేష సేవలు అందించిన సెలబ్రిటీలకు 2024 సంవత్సరానికి అందించే ఈ అవార్డుల విజేతల వివరాలను ఈరోజు సాయంత్రం కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారికంగా ప్రకటించనుంది. ముఖ్యంగా ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలో 11 మంది సభ్యుల జ్యూరీ సమక్షంలో గురువారం అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం సాయంత్రం ఈ జాబితాను ప్రకటించనున్నారు.

రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు..

అయితే ఈసారి సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవార్డుల కోసం చాలామంది హీరోలు సిద్ధమయ్యారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ కల్కి 2898AD చిత్రం ఉత్తమ చిత్రం లేదా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డు సాధించడం ఖాయమని అటు ఇండస్ట్రీ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి.ఇక అలాగే గతంలో పుష్ప : ది రైజ్ చిత్రానికి గానూ నటుడిగా జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. ఇక ఈసారి పుష్ప 2: ది రూల్ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను ఆయన మళ్లీ రేస్ లో నిలిచారు. ముఖ్యంగా ఇలా ఈసారి కూడా జాతీయ అవార్డుల జాబితాలో బన్నీ నిలిచాడు అనే వార్తలు రావడంతో గత ఘనతను బన్నీ పునరావృతం చేస్తారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

also read:మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన అమీర్ ఖాన్!

బన్నీకి ఇతర భాషల నుండి గట్టి పోటీ..

ఇకపోతే ఈ ఏడాది ఉత్తమ నటుడు విభాగంలో టాలీవుడ్ కి ఇతర భాషల నుండి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్ నుండి కార్తిక్ ఆర్యన్ చందు ఛాంపియన్, అజయ్ దేవగన్ మైదాన్, మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం వంటి చిత్రాల ద్వారా గట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఈ అవార్డులను ఎవరు ఈసారి గెలుచుకోబోతున్నారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని గంటల్లో అధికారికంగా వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే. ఏదేమైనా 72వ జాతీయ చలనచిత్ర పురస్కార వేడుకల్లో టాలీవుడ్ నుండి అలాగే సౌత్ నుండి ఏ ఏ విభాగాలలో ఎవరెవరు ఈ అవార్డును దక్కించుకోబోతున్నారో తెలుసుకోవాలని ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ కనబరుస్తున్నారు. ఆ ఆత్రుతకు మరి కాసేపట్లో తెర దించబోతున్నారని చెప్పవచ్చు.

Related News

ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

Big Stories

Advertisement
×