Aamir Khan:సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామ్యులతో కడదాకా కొనసాగుతారా అంటే చెప్పలేని పరిస్థితి. నచ్చితే జీవితాంతం ఉంటారు.. నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరు పడతారు. ఇంకొకరిని తమ జీవితంలోకి తెచ్చుకొని సంతోష జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరో ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమవుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమీర్ ఖాన్. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తన ప్రేయసితో కొత్త వైవాహిక జీవితాన్ని గడపడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు పెళ్లి తేదీని, వేదికను అభిమానులతో పంచుకొని సర్ప్రైజ్ ఇచ్చారు. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమీర్ ఖాన్ తన వివాహ వార్తలను అధికారికంగా ధ్రువీకరించారు. గత కొంతకాలంగా తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకోబోతున్నాడని వచ్చిన వార్తలను ఆయన నిజం చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక సినిమా స్క్రీనింగ్ ఈవెంట్ లో పాల్గొన్న అమీర్ ఖాన్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ..” జూలై 5వ తేదీన మా వివాహం జరగనుంది.
అయితే ఈ వేడుకను ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా ఇంట్లోనే సింపుల్గా వివాహం చేసుకోబోతున్నాము. మా ఇద్దరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు.. అందరి ఆశీస్సులు, దీవెనలు మాకు కావాలి. మేము ఎప్పుడు సంతోషంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ మీడియా ద్వారా అభిమానులను కోరారు అమీర్ ఖాన్. ఇకపోతే ఈ వివాహానికి ఎటువంటి భారీ వెడ్డింగ్ రిసెప్షన్ లేదా స్టార్ స్టడెడ్ ఈవెంట్ ను నిర్వహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇంట్లో కుటుంబ సభ్యుల కోరిక మేరకు వివాహం చేసుకొని.. అనంతరం వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అమీర్ ఖాన్ , గౌరీ.
also read:బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?
అమీర్ ఖాన్ మూడో వివాహం చేసుకోబోతున్న చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే, బెంగళూరుకి చెందిన వెల్నెస్ రంగానికి చెందిన మహిళ ఈమె. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న బ్రిటిష్ కమ్యూనిస్ట్ ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు కూడా.. గత కొంతకాలంగా గౌరీ , అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తోంది. ఇక గత ఏడాది మార్చిలో తన 60వ రోజు సందర్భంగా తనకు కాబోయే మూడవ భార్య అంటూ మీడియాకు ఆమెను పరిచయం చేశారు. ఇకపోతే అమీర్ ఖాన్ కి ఇంతకుముందే రీనా దత్త, కిరణ్ రావు లతో వివాహం జరిగి విడాకులు అయ్యాయి.
రీనా దత్తతో జునైద్ ఖాన్, ఐరా ఖాన్ జన్మనివ్వగా.. కిరణ్ రావు తో ఆజాద్ లకు జన్మనిచ్చారు అమీర్ ఖాన్ . ఇకపోతే గౌరీ కి ఇదివరకే వివాహం జరగగా.. క్విన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ నలుగురు పిల్లల సమక్షంలో ఈ వివాహ వేడుక చాలా సింపుల్గా జరగనుంది.