E-Paper
Advertisement

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతున్న హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు!

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతున్న హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు!
Advertisement

Tollywood Hero: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రేగ్నెన్సీని ప్రకటిస్తూ తల్లితండ్రులుగా మారబోతూ శుభవార్తను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే గత ఏడాది పెళ్లి చేసుకున్న వారందరూ కూడా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నటుడు నారా రోహిత్ (Nara Rohit)సైతం త్వరలోనే తండ్రి కాబోతున్నారని తెలుస్తుంది.

తల్లి కాబోతున్న నటి సిరి లెల్లా..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత గత ఏడాది నటి సిరి లెల్లా(Siri Lella)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన వెంటనే సిరి ప్రెగ్నెంట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నారా రోహిత్ ఎక్కడ తెలియచేయకపోయినా తాజాగా ఈమె సీమంతపు వేడుకలకు(Baby Shower) సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నారా రోహిత్ సిరి తల్లిదండ్రులుగా మారబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్, సిరి..

Advertisement

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. నారా రోహిత్ సిరి ఇద్దరు ప్రతినిధి 2 సినిమాలు జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇలా ఈ జంట గత ఏడాది పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లయిన ఏడాదిలోగా ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు.

ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్..

Advertisement

ఇక ఇటీవల కాలంలో నారా రోహిత్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది భైరవం అనే సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న రోహిత్ అనంతరం సుందరకాండ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నారా రోహిత్ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రోహిత్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

?igsh=M3R4M3Jxa2c4MG41

Also Read: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బాలయ్య సినిమా… ఎవరూ ఊహించిన కాంబో సెట్ అయ్యిందా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×