E-Paper
Advertisement

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Advertisement

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రీమ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నంచేద్దాం.

మొత్తం 15 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగంలో 05 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ అకౌంట్స్ విభాగంలో 5 పోస్టులు కేటాయించారు. క్రెడిట్ ఆఫీసర్ విభాగంలో మిగిలిన 5 పోస్టులను భర్తీ చేస్తారు.

Advertisement

వెకెన్సీల సంఖ్య: 15

విద్యార్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు అవుతారు. సీఏ లేదా సీఎఫ్ఏ లేదా సీఎంఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో ఖచ్చితంగా ఉద్యోగానుభవం ఉండాలి.

Advertisement

వయస్సు: అభ్యర్థుల వయస్సు 33 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి దశలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు రూ.175 నిర్ణయించారు. దివ్యాంగులు ఇంకా మహిళా అభ్యర్థులు కూడా రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వర్గాల అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల వారు మే 17వ తేదీలోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. అధికారులు ఆన్‌లైన్ పరీక్షను జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇంటర్వ్యూలు కూడా జూన్ నెలలోనే తాత్కాలికంగా షెడ్యూల్ చేశారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్‌డేట్స్ తెలుసుకోవాలి.

ALSO READ: రూ.58వేల జీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, అప్లై చేసుకోవచ్చు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×