E-Paper
Advertisement

Tollywood actress: అటు డాక్టర్స్.. ఇటు యాక్టర్స్.. ఈ సెలెబ్రిటీస్ భలే మేనేజ్ చేస్తున్నారే?

Tollywood actress: అటు డాక్టర్స్.. ఇటు యాక్టర్స్.. ఈ సెలెబ్రిటీస్ భలే మేనేజ్ చేస్తున్నారే?
Advertisement

Tollywood actress: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా.. రాణిస్తున్న వారు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర వృత్తుల్లో కూడా స్థిరపడిన వారు ఉంటారు.అలా సినిమా ఇండస్ట్రీ అనేది వారికి ఒక ప్యాషన్ లాగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువతో చాలామంది తమ ఇతర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా రాణిస్తూ ఉంటారు. అలా ఇప్పటికే మన సినిమా ఇండస్ట్రీలో ఓవైపు డాక్టర్ వృత్తిని కొనసాగించి.. మరోవైపు సినిమాల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంతకీ మన సినీ.. ఇండస్ట్రీలో అటు డాక్టర్లుగా వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు యాక్టర్లుగా చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు.. వారంతా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు డాక్టర్లుగా మరోవైపు యాక్టర్లుగా ఉన్న వారిలో శ్రీలీల, సీనియర్ నటుడు, రాజశేఖర్,సాయి పల్లవి, అదితి గోవిత్రికర్,సీనియర్ దివంగత నటుడు అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి,అదితి శంకర్, శివాని రాజశేఖర్ వంటి వాళ్లు ఓవైపు డాక్టర్ వృత్తిని నేర్చుకొని మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు.

Advertisement

శ్రీ లీల..

ఇక విషయంలోకి వెళ్తే.. యంగ్ హీరోయిన్లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల (Sreeleela) ఎంబిబిఎస్ పూర్తి చేస్తూనే మరోవైపు సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఓవైపు ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ రాస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందింది.

Advertisement

సాయి పల్లవి..

ఇక మరో హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) కూడా ఎంబిబిఎస్ పూర్తి చేసింది.అలా సమయం దొరికినప్పుడల్లా డాక్టర్ గా తన వృత్తి ధర్మాన్ని కూడా పాటిస్తుంది. అలాగే సినిమాల్లో అవకాశాలు లేకపోతే డాక్టర్ గానే తన జీవితాన్ని గడిపేస్తానని ఓ ఇంటర్వ్యూలో కూడా సాయి పల్లవి చెప్పింది.

రాజశేఖర్..

ఇక సీనియర్ నటుడు యాంగ్రీ మ్యాన్ గా పేరొందిన రాజశేఖర్(Raja Sekhar) కూడా డాక్టర్ విద్యను అభ్యసించారు. ఈయన ఎంబిబిఎస్ ని పూర్తి చేసి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఫ్రీగా వైద్యం కూడా చేస్తూ ఉంటారు.రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ (Shivani Raja Sekhar) కూడా తండ్రి బాటలోనే ఎంబిబిఎస్ పూర్తి చేసి సినిమా రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అల్లు రామలింగయ్య..

దివంగత నటుడు, ది గ్రేట్ హాస్య నటుడు అల్లు రామ లింగయ్య (Allu Ramalingaiah)కూడా హోమియోపతి డాక్టర్ అన్న సంగతి ఇప్పటి జనరేషన్ కి చాలా మందికి తెలియదు. ఆయన హోమియోపతి డాక్టర్ గా బ్రతికున్న సమయంలో ఎంతోమందికి వైద్యం చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా లెజెండ్రీ కమెడియన్ గా రాణించారు.

ప్రభాకర్ రెడ్డి..

ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు. కానీ చిత్రపురి కాలనీకి కోట్ల విలువ చేసే భూమిని ఉచితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి దానం చేసిన నటుడు అనగానే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.ఈయన కూడా డాక్టర్ విద్యను అభ్యసించి ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు.

భరత్ రెడ్డి..

ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణిస్తున్న భరత్ రెడ్డి(Bharath Reddy) కూడా డాక్టరే.. ఈయన డాక్టర్ విద్యను అభ్యసించి సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అలా సినిమాలు చేస్తూనే అవకాశాలు లేనప్పుడు తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తారు.

అదితి గోవిత్రికర్..

అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తమ్ముడు మూవీ (Tammudu Movie) లో లవ్లీ అనే పాత్రలో నటించిన అదితి గోవిత్రికర్ (Aditi Govitrikar) కూడా డాక్టర్ చదివి సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది.

అదితి శంకర్..

స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కూతురు అయినటువంటి అదితి శంకర్(Aditi Shankar) కూడా ఎంబిబిఎస్ పూర్తి చేసి సినిమా రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కోమలి ప్రసాద్..

ఇక హిట్-2 (Hit-2), లూజర్,టచ్ మీ నాట్ వంటి సినిమాల్లో నటించిన కోమలి ప్రసాద్ (Komali Prasad) కూడ…

ALSO READ:Fish Venkat Demise: నేడే ఫిష్ వెంకట్ అంత్యక్రియలు.. ఎక్కడంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×