E-Paper
Advertisement

Tollywood Boxoffice: ఉస్తాద్ కూడా ముంచేశాడు! శ్రీరాముడైనా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని కాపాడతాడా?

Tollywood Boxoffice: ఉస్తాద్ కూడా ముంచేశాడు! శ్రీరాముడైనా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని కాపాడతాడా?

Tollywood Boxoffice: టాలీవుడ్‌కి ఈ ఏడాది మార్చి నెల అస్సలు కలిసి రావడం లేదు. వేసవి సెలవులు దగ్గరపడుతున్నా, థియేటర్ల వద్ద సందడి మాత్రం కనిపించడం లేదు. ఈ నెలలో ఇప్పటివరకు విడుదలైన అరడజనుకు పైగా చిన్న సినిమాలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. కంటెంట్ లో దమ్ము లేకపోవడం, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ల ముఖం చూడటమే మానేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్: ఆశలన్నీ అడియాసలేనా?
మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉండేవి. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ సినిమాను గట్టెక్కిస్తాయని భావించారు. కానీ, రొటీన్ కథనం, ఓల్డ్ ఫార్ములా మేకింగ్‌తో సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తొలిరోజు భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకు 35 శాతం రికవరీ కూడా చేయలేక ‘డిజాస్టర్’ దిశగా పయనిస్తుండటం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఉస్తాద్‌తో బాక్సాఫీస్ వద్ద మోత మోగుతుందనుకుంటే, అది కాస్తా నిశ్శబ్దంగా మారిపోయింది.ఈ నేపథ్యంలో, శ్రీరామనవమి వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐదు సినిమాలు క్యూ కట్టాయి. మరి ఈ వారమైనా టాలీవుడ్ జాతకం మారుతుందా? లేక ప్లాపుల పరంపర కొనసాగుతుందా? అనే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.

బ్యాండ్ మేళం: బావామరదళ్ల రొటీన్ రాగం?

‘కోర్టు’ సినిమాతో కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జోడీ మరోసారి బావామరదళ్ల కథతో వస్తున్నారు. “నువ్వు వచ్చిన తర్వాతే నా గుండె అతుక్కుంది.. మళ్ళీ నువ్వే పగలగొట్టావు” అంటూ హీరో చెప్పే ఎమోషనల్ డైలాగులు బాగానే ఉన్నా, కథలో కొత్తదనం ఉందా? అన్నదే అసలు ప్రశ్న. పల్లెటూరి నేపథ్యం, మరదలి కోసం బావ తపన పడటం వంటి పాత ఫార్ములాలు ఇప్పుడున్న యూత్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. సాయికుమార్ కీలక పాత్రలో ఉన్నప్పటికీ, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మీదనే ఈ సినిమా ఆశలన్నీ ఉన్నాయి. మార్చి 26న విడుదలవుతున్న ఈ చిత్రం ‘బ్యాండ్’ వాయిస్తుందో లేక ‘మేళం’తో సరిపెట్టుకుంటుందో వేచి చూడాలి.

GOAT: సుడిగాలి సుధీర్ క్రేజ్ గట్టెక్కిస్తుందా?

టెలివిజన్ లో స్టార్ గా వెలిగిన సుడిగాలి సుధీర్, వెండితెరపై మాత్రం ఇంకా సరైన హిట్ కోసం వెతుకులాటలోనే ఉన్నాడు. క్రికెట్ నేపథ్యంలో కమర్షియల్ హంగులతో వస్తున్న ‘జి.ఓ.ఏ.టి’ (GOAT) పై సుధీర్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దివ్యభారతి గ్లామర్, కామెడీ ఎలిమెంట్స్ ప్లస్ పాయింట్ అని చెబుతున్నా, ప్రమోషన్లలో ఈ సినిమా వెనుకబడి ఉంది. మార్చి 26నే ఇది కూడా థియేటర్లలోకి వస్తోంది. మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడంలో సుధీర్ సక్సెస్ అయితేనే బాక్సాఫీస్ వద్ద ఈ ‘మేక’ పులిలా గర్జిస్తుంది.

సుయోధన: ప్రియదర్శి ప్రయోగం ఫలిస్తుందా?

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ సెట్ చేసుకున్న ప్రియదర్శి, ఈసారి ‘సుయోధన’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. ఒక మనిషిలోని మంచి-చెడుల మధ్య పోరాటమే ఈ సినిమా అని దర్శకుడు చెబుతున్నారు. సాయికుమార్, ప్రేమ వంటి సీనియర్ నటులు ఉన్నా.. ఇలాంటి డార్క్ థ్రిల్లర్లకు థియేటర్ లో ఆదరణ తక్కువగానే ఉంటోంది. మార్చి 27న విడుదలవుతున్న ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తేనే బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. లేదంటే మరో ‘ఓటీటీ మెటీరియల్’ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

యూత్ & హ్యాపీ రాజ్: డబ్బింగ్ సినిమాల దండయాత్ర!

టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే, పక్క రాష్ట్రం నుండి తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. కెన్ కరుణాస్ నటించిన ‘యూత్’ స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. మరోవైపు జి.వి. ప్రకాష్, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన ‘హ్యాపీ రాజ్’ కూడా మార్చి 27న వస్తోంది. ‘ప్రేమదేశం’ ఫేమ్ అబ్బాస్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే, తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోల మీద పెద్దగా అవగాహన లేదు. మన లోకల్ సినిమాలే గతుకులు లేకుండా సాగుతుంటే, ఈ డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం అంటే ఆశామాషీ  విషయం కాదు.

బాక్సాఫీస్ రిపోర్ట్: రాముడే దిక్కు!

మార్చి నెలలో ఇప్పటివరకు వచ్చిన ‘ప్లాపుల మేళం’ చూస్తుంటే, చిన్న సినిమాల పట్ల ఆడియన్స్ లో ఒక రకమైన విరక్తి ఏర్పడింది. సరైన పెద్ద సినిమా లేకపోవడం ఎగ్జిబిటర్లను ముంచేస్తోంది. ఈ వారం విడుదలవుతున్న ఐదు సినిమాల్లో కనీసం ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోతే, టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఇది బ్లాక్ మంత్ గానే మిగిలిపోతుంది. శ్రీరామనవమి పర్వదినాన వస్తున్న ఈ చిత్రాలను ఆ రాముడైనా కాపాడతాడా? లేక బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దమే రాజ్యమేలుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

also read : Band Melam: బావామరదళ్ల ‘బ్యాండ్‌ మేళం’.. థియేటర్లలో మోత మోగిస్తుందా?

Related News

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ ఎడిటర్.. హీరో సూర్య షాకింగ్ రియాక్షన్…

Peddi Day1 Collections : బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత.. ఒక్కరోజుకే 100 కోట్లా..?

పవన్‌ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. నటి హేమ స్ట్రాంగ్ కౌంటర్..

బాలీవుడ్ లో తెలుగు బ్యూటీల హవా.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

Big Stories

×