E-Paper
Advertisement

RailOne App: రైల్ వన్ తో నయా స్కామ్, ఏకంగా టికెట్ లేకుండానే ప్రయాణం!

RailOne App: రైల్ వన్ తో నయా స్కామ్, ఏకంగా టికెట్ లేకుండానే ప్రయాణం!
Advertisement

RailOne App Glitch: రైల్వే ప్రయాణికుల కోసం రూపొందించిన ‘రైల్ వన్’ టికెటింగ్ యాప్‌ లో షాకింగ్ బగ్ బయటపడింది. ఈ టెక్నికల్ సమస్య కారణంగా ప్రయాణికులు రైలులో ఎక్కిన తర్వాత కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. సాధారణంగా, జియో ఫెన్సింగ్ విధానం ద్వారా స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే టికెట్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉండాలి. కానీ, ఈ ఫీచర్ సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది టికెట్ లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మార్చి నుంచి సాంకేతిక సమస్యలు

‘రైల్ వన్’ యాప్‌ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం స్టేషన్లలో రద్దీ తగ్గించడం, టికెట్ కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడం. అయితే, మార్చి నెల నుంచి ఈ యాప్ లో లోపం కనిపిస్తోందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ముంబై సబర్బన్ రైల్వే నెట్‌ వర్క్‌ లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు.

రన్నింగ్ ట్రైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న ఘటనలు

Advertisement

తాజాగా జరిగిన తనిఖీల్లో, కదులుతున్న లోకల్ రైలులోనే ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్న ఘటనలు బయటపడ్డాయి. కల్యాణ్ వైపు వెళ్లే ఏసీ లోకల్ రైలులో టికెట్ తనిఖీ సమయంలో ఇలాంటి ఘటనలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జియో ఫెన్సింగ్ వ్యవస్థ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు రూల్స్ ను  సులభంగా తప్పించుకుంటున్నారని వెల్లడించారు.

ఈ సమస్యపై రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు రాజీవ్ సింఘాల్ కీలక విషయాలు వెల్లడించారు.  ప్రయాణికులు ప్లాట్‌ ఫారమ్‌ పై ఉన్నప్పుడు టికెట్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది. కానీ, రైలు బయలుదేరిన తర్వాత ఆ అవకాశం నిలిపివేయాలని సూచించారు. అయితే, సాంకేతిక పరిమితుల వల్ల ఇది పూర్తిగా నియంత్రించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.

Advertisement

టికెట్ లేని ప్రయాణం పెరగడం వల్ల రైళ్లలో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీనివల్ల రైళ్ల టైమ్ మెయింటెనెన్స్ కూడా దెబ్బతింటోంది. ప్రతి రోజు సగటున 10 నుంచి 15 నిమిషాల ఆలస్యం అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముంబై సబర్బన్ రైల్వేలోని మెయిన్ లైన్, హార్బర్ లైన్ ఈ సమస్య వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ట్రాక్ మరమ్మతులు, సిగ్నల్ సమస్యలు, అక్రమ ప్రవేశాలు, ముందస్తు సమాచారం లేకపోవడం లాంటి అంశాలు కూడా రైళ్ల ఆలస్యానికి కారణమవుతున్నాయి.

‘రైల్ వన్’ యాప్‌లో ఉన్న ఈ లోపాన్ని త్వరగా సరి చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. లేకపోతే టికెట్ లేని ప్రయాణం పెరిగి, రైళ్లలో రద్దీ, ఆలస్యాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని నిపుణులు రైల్వే అధికారులకు సూచిస్తున్నారు.

Read Also: వందేభారత్ సూపర్ హిట్.. ఏడాదిలో ఎన్నికోట్ల మంది ప్రయాణించారంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×