BigTV English
Advertisement

Tollywood Movies :భార్యల గొప్పతనం తెలిపే సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

Tollywood Movies :భార్యల గొప్పతనం తెలిపే సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

Tollywood Movies : తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకతను సంపాదించుకున్నాయి.. ఒక్కో జానర్ లో వచ్చిన సినిమాలు ఒక్కో ప్రేక్షకుడి హార్ట్ ను టచ్ చేసాయి. అందులో ఈరోజు మనం భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన భార్య భర్తల బంధం సంబంధించిన సినిమాలలో పవిత్ర బంధం, సర్దుకుపోదాం రండి, మజిలీ, అనుగ్రహం వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం…


అనుగ్రహం.. 

ఇది 1978లో విడుదలైన సినిమా. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని, వారి మధ్య వచ్చే సమస్యలను, వాటిని ఎలా ఎదుర్కోవాలనేది చెబుతుంది.. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులు ఉండడం విశేషం.


పవిత్ర బంధం.. 

వెంకటేష్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన పవిత్ర బంధం చిత్రం 1996 లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు. సి. వెంకటరాజు, జి. శివరాజు గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.

ఆహ్వానం.. 

1997లో విడుదలైన భారతీయ తెలుగు భాషా చిత్రం, దీనిని ఎస్.వి. కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ , రమ్య కృష్ణ , మరియు హీరా నటించారు . దర్శకుడు ఈ చిత్రాన్ని 2012లో ఇంగ్లీషులో డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో పునర్నిర్మించారు. భార్య యొక్క గొప్పతనం తెలుసుకొని చివరికి ఆమెను దగ్గరకు తీసుకుంటాడు భర్త. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సర్దుకుపోదాం రండి.. 

సర్దుకుపోదాం రండి 2000 సంవత్సరంలో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌లో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించగా, ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

మహానటి..

ఇది సావిత్రి జీవితం ఆధారంగా తీసిన సినిమా. ఇందులో ఆమె నటన, వ్యక్తిత్వం, మరియు స్త్రీ శక్తిని గొప్పగా చూపించారు.

గార్గి.. 

ఈ సినిమా కూడా మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమా. ఇందులో ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, న్యాయాన్ని ఎలా కాపాడుకుంటుందో చూపిస్తుంది.

మిసెస్ అండర్ కవర్.. 

ఈ సినిమాలో భార్య ఒక సీక్రెట్ ఏజెంట్ అని తెలుస్తుంది. ఇందులో ఆమె తన కుటుంబం, దేశం కోసం చేసే పోరాటం చూపించారు..

మజిలీ..

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్ళైయ్యాక మొదటగా కలిసి నటించిన మూవీ ఇది..ఈ సినిమాలో భార్య భర్త కోసం చేసే త్యాగాలు, వారి అనుబంధం గొప్పగా చూపించారు. ఇందులో భార్య పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె గొప్పతనాన్ని హైలైట్ చేశారు.

Also Read: నేడు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. భయంతో వణికిపోవాల్సిందే..!

మనం చెప్పుకున్నవి కొన్ని సినిమాలే.. కానీ అప్పటిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా, గృహలక్ష్మి, అత్తగారి కథ, అత్తారింటికి దారేది, సీతారాముల కళ్యాణం లాంటి సినిమాలు కూడా భార్యల ప్రాముఖ్యతను, వారి పాత్రను తెలియజేస్తాయి. ఈ సినిమాలు భార్యాభర్తల బంధం, కుటుంబ విలువలు, స్త్రీ యొక్క స్థానం గురించి చెబుతాయి..

Related News

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Jana Nayagan First Single: జననాయగన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థళపతి కచేరి అంటూ!

Thiruveer : సక్సెస్ అవ్వకుండానే సెలబ్రేషన్ చేస్తారు.. నిర్మాతలపై హీరో సెటైర్

Suma Kanakala: పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ నుంచి పారిపోయిన సుమ..అంత భయపడ్డారా?

Kamakshi Bhaskarala: ఆ పని కోసం స్మశానానికి వెళ్తున్న హీరోయిన్  … ఇదేం అలవాటు రా బాబు!

The Great Pre wedding show : యాస తెలియకపోయినా, హీరోని మించిపోయాడు

Sikindar: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సికిందర్.. వాటిని యాడ్ చేస్తూ!

Big Stories

×