Friday Ott Release Movies: మరోవారం వచ్చేసింది.. ఒకవైపు వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది.. మూవీ లవర్స్ సేఫ్ గా ఇంట్లోనే ఉంటూ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ప్రతివారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. . ఫ్రైడే రోజున బకాసుర రెస్టారెంట్ , సు ఫ్రమ్ సో అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమాలు ఏవో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. ఆగస్టు 8 ఒక్కరోజే దాదాపు 15 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారము కొన్ని సినిమాలు మాత్రమే అందుబాటులోకి వచ్చేసాయి.. అందులోను సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ వారం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక అసలు ఆలస్యం లేకుండా ఏ సినిమాలు ఏ ఫ్లాట్ ఫామ్ లో రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే…
జీ5..
మామన్(తమిళసినిమా)- ఆగస్టు 08
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగువెబ్సిరీస్)- ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08
సన్ నెక్స్ట్..
హెబ్బులికట్(కన్నడసినిమా)- ఆగస్టు 08
లయన్స్ గేట్ ప్లే..
ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (హాలీవుడ్వెబ్ సిరీస్) – ఆగస్టు 08
ఎమ్ఎక్స్ ప్లేయర్..
బిండియే కే బాహుబలి (హిందీవెబ్ సిరీస్) – ఆగస్టు 08
అమెజాన్ ప్రైమ్ వీడియో…
అరేబియాకడలి (తెలుగువెబ్ సిరీస్)- ఆగస్టు 08
జియోహాట్ స్టార్..
సలకార్(హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 08
సోనీలివ్..
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ -సీజన్-4(అమెరికన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 08
నెట్ ఫ్లిక్స్..
స్టోలెన్-హైయిస్ట్ఆఫ్ ది సెంచరీ (హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 08
ఓహోఎంతన్ బేబీ (తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆగస్టు 08
సైనా ప్లే..
నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 08
Also Read: శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…
మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం బోలెడు సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్నాయి. 15 సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి . అందులో కొన్ని తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వర్షాలకు బయటకు వెళ్లలేని వాళ్లు ఈ సినిమాలను మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి.
ఆగస్టు నెలలో థియేటర్లలోకి స్టార్ హీరోల సినిమాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో రజినీ కాంత్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతేకాదు మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర మూవీ కూడా రిలీజ్ కానుంది.. వీటితో పాటుగా చిన్న సినిమాలు బోలెడు విడుదల కాబోతున్నాయి.