Theater Movies: ప్రతి నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో నేడు చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. దాదాపుగా 50 సినిమాలకు పైగా విడుదలకాబోతున్నాయి. రానున్న వారం వార్2, కూలీ వంటి భారీ చిత్రాలు థియేటర్లకు వస్తున్నాయి.. వినాయక చవితి, దసరా సీజన్ స్టార్ట్ కానుండడంతో పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.. మరి కాస్త ఖాళీ ఉంది అంటే ఈ వారమే.. ఈ శుక్రవారం తెలుగు తో పాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం పదండి..
తెలుగులో రిలీజ్ కాబోతున్న సినిమాలు..
బకాసుర, మాతృ సినిమాలతో పాటు కన్నడ డబ్బింగ్ చిత్రం సూ ఫ్రం సో, సురేశ్ గోపి, అనుపమ నటించిన మలయాళ డబ్బింగ్ చిత్రం జానకి వర్సెస్ కేరళ వంటి మూవీస్‌పై మాత్రమే అంచనాలు ఉన్నాయి.. సూ ఫ్రం సో మూవీ కన్నడ నుంచి తెలుగులో డబ్బింగ్ చేయబడింది.. ఈ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ వారం సినిమాలలో భారీ బడ్జెట్ చిత్రాల కన్నా ఈ సినిమానే ఎక్కువగా పాజిటివ్ టాక్ ని అందుకునే అవకాశం ఉందని ట్రైలర్ లోని సన్నివేశాలను చూస్తే తెలుస్తుంది. కమెడియన్ ప్రవీణ్ నటించిన బకాసుర రెస్టారెంట్ చిత్రాలు సైతం హర్రర్ సినిమాలే కావడం గమనార్హం. ఇలా మొత్తంగా ఈ ఆగస్టు8న విడుదల కానున్న సినిమాల్లో అధిక శాతం భయపెట్టే చిత్రాలే కావడం యాదృశ్చికమా లేక దెయ్యాల మధ్య పోటీనా అనేది తెలియదు.. ఈవారం తెలుగులో ఎక్కువగా దెయ్యాల సినిమాలు..
హిందీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు..
జోరా, రజ్వీర్,టూ గెదర్, అందాజ్, గీక్ పిచ్, ఫ్రీఖిర్ శుక్రవారం,సుందరంగార్ కి సుందరి, ఉదయపూర్ ఫైల్స్: కన్హయ్య లాల్ టైలర్ హత్య వంటి సినిమాలు రిలీజ్ కి రెడీ కాపోతున్నాయి.
Also Read :
తెలుగు హిందీలో మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హిందీ, తమిళం నుంచి తొమ్మిదేసి ,చిత్రాలు తెలుగులో8, కన్నడలో 7, ఇంగ్లీష్‌లో5, మలయాలంలో 3 మరాఠిలో 2, భోజ్ పురిలో2, గుజరాతిలో మూడేసి సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాయి.. ఈ సినిమాలన్నిటిలో ఎక్కువగా దెయ్యాల సినిమాలు ఉండడంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను భయపెడుతుందో చూడాలి..
ఇకపోతే ఈ నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. అందరి దృష్టి రజినీ కాంత్ కూలీ మూవీ పైనే ఉంది. భారీ అంచనాలతో ఈ మూవీ రాబోతుంది. అలాగే రవి తేజ మాస్ జాతర మూవీ కూడా రాబోతుంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..