E-Paper
Advertisement

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!
Advertisement

prince Cecil:ఒకప్పుడు పెళ్లి అంటే చాలా హంగు ,ఆర్భాటాలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో చడీ చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరి జీవితంలో వచ్చే ప్రతి విషయము అభిమానులకు ఒక పండుగ లాంటిది. అలాంటిది అభిమానులకు కూడా చెప్పకుండా పెళ్లి అనే ఒక అతిపెద్ద విషయాన్ని సింపుల్గా చెప్పేసి ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే అలా సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని.. పెళ్లికి సిద్ధమవుతున్నారు ఒక టాలీవుడ్ హీరో. ఇప్పటికే అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆ టాలీవుడ్ హీరో ? ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో..

ఆయన ఎవరో కాదు ప్రముఖ హీరో ప్రిన్స్ సెసిల్.. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు దక్కించుకున్న ప్రిన్స్.. ఒకవైపు హీరోగా , మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ఆకట్టుకోవడమే కాకుండా విలన్ పాత్రలు కూడా పోషించి, ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డాష్ డాష్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రిన్స్.. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాలో కూడా హీరోగా నటించారు.. రొమాన్స్, బన్నీ ఎన్ చెర్రీ ఇలా ఎన్నో చిత్రాలలో నటించాడు. కానీ ఏవి కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు.

Advertisement

ఇక తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలా నేను శైలజ, డీజే టిల్లు వంటి చిత్రాలు చేసిన ప్రిన్స్ .. ఈ ఏడాది మార్చిలో సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసనిలో కనిపించారు. అంతేకాదు రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్లో కూడా పాల్గొన్న ప్రిన్స్.. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

also read:కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

సైలెంట్ గా నిశ్చితార్థం..

Advertisement

సాయి మాచిరాజు అనే అమ్మాయితో గత నెల ప్రారంభంలోనే ప్రిన్స్ నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ మేరకు ఒక వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తాను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నాను అంటూ అసలు విషయం బయట పెట్టాడు. గత ఏడాది సెప్టెంబర్ లో ఒక ఫ్రెండ్ పెళ్లిలో తాము ఇద్దరం కలుసుకున్నామని, అలా స్నేహితులమయ్యామని , ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని నిశ్చితార్థం చేసుకున్నామని, పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతున్నామంటూ ప్రిన్స్ చెప్పుకొచ్చారు.

ప్రిన్స్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్..

ప్రిన్స్ చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. సాయి మాచిరాజు అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం సాయి కుటుంబం న్యూజిలాండ్ లోనే ఉంటుంది. ఈమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది .ఈ క్రమంలోనే ఆగస్టు 24వ తేదీన వీరి పెళ్లి కూడా న్యూజిలాండ్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్ ఎవరో కాదు నటుడు ప్రియదర్శి. ప్రిన్స్ తాజాగా సాయికి ప్రపోజ్ చేసిన వీడియో షేర్ చేయగా.. ఆ వీడియోలో ప్రియదర్శి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ప్రియదర్శితోపాటు ఇరువురి సన్నిహితులు కూడా ఆ వీడియోలో కనిపించారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×