E-Paper
Advertisement

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?
Advertisement

National award: ప్రతిభకు కాదు ఏది అనర్హం అని నిరూపించింది వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా తన అద్భుతమైన, మధురమైన గాత్రంతో దేశస్థాయిలో ప్రేక్షకులను మెప్పించి, నేడు జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పుట్టుకతోనే కంటి చూపు లేకపోయినప్పటికీ.. తన స్వరంతో ఎన్నో మలయాళ, తమిళ్, తెలుగు పాటలను ఆలపించి సంగీతం పట్ల తనకున్న అంకిత భావాన్ని నిరూపించుకుంది. అంతేకాదు అరుదైన గాయత్రీ వీణ వాయిద్యాన్ని వాయించడంలో అపారమైన నైపుణ్యం సంపాదించిన విజయలక్ష్మి గిన్నిస్ రికార్డును కూడా అందుకుంది.

ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు..

జూలై 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2024లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ నేషనల్ అవార్డులు ప్రకటించడం జరిగింది. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వైకోమ్ విజయలక్ష్మి.ARM (అజయన్తే రాండం మోషణం) సినిమాలోని ‘అంగు వాన కోనిలు’ అనే పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు లభించింది. తెలుగులో “అంబరాల వీధిలో” అంటూ వేరే సింగర్ పాడారు. ప్రస్తుతం నేషనల్ అవార్డు లభించడంతో ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా తెగ ఆరా తీస్తున్నారు కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్ లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు.

పేదరికం.. పుట్టుకతోనే దృష్టిలోపం..

Advertisement

పేదరికం.. దీనికి తోడు పుట్టుకతోనే దృష్టి లోపంతో జన్మించిన ఈమె.. ప్రపంచాన్ని కళ్ళతో చూసే అదృష్టం లేకపోయినా.. సంగీతాన్ని హృదయంతో ఆస్వాదించే వరం అందుకున్నారు. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న విజయలక్ష్మి.. వీణ వాయించడంలో విశేష ప్రతిభ కనబరిచారు. 2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె.. సంగీత ప్రియులను, మ్యూజిక్ డైరెక్టర్ లను ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఈమెకు మంచి గుర్తింపును అందించింది.

also read:విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

ఆలపించిన పాటలు:

Advertisement

అలాగే తేరి చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్టపుల్ల వంటి ఎన్నో పాటలు ఈమెకు మంచి గుర్తింపును అందించాయి. ఇకపోతే ఈమె తెలుగులో పాడిన చిత్రాల విషయానికి వస్తే.. బాహుబలి చిత్రంలోని ‘ఎవ్వడంట ఎవ్వడంట’ తమిళ్ వెర్షన్ లో పాటను ఆలపించారు. అంతేకాదు ఎన్నో తమిళ డబ్బింగ్ తెలుగు చిత్రాలలో కూడా పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించారు. అలా విజయ్ పోలీసోడు చిత్రంలో ‘కన్నుల్లో ఉన్నావు’ అనే పాటను కూడా తెలుగులో ఈమె ఆలపించారు.

ARM సినిమా విశేషాలు..

ARM చిత్రం విషయానికి వస్తే.. 2024లో మలయాళ భాష యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. పైగా ఆయనకిది తొలి చిత్రం కావడం గమనార్హం. సుజిత్ నంబియార్ రచించగా.. మ్యాజిక్ ఫ్రేమ్స్, U.GM ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 12న విడుదలై రూ.30 కోట్ల బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద రూ.107.77 కోట్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×