Heroins: ఒకప్పుడు సమ్మర్ అంటే పెద్ద హీరోల జాతర.. కానీ ఇప్పుడు సీన్ సితారే. కొత్త సినిమాల హడావుడి తగ్గినా.. హీరోయిన్ల మధ్య మంటలు మాత్రం మామూలుగా లేవు. ఈ వేసవి బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల యుద్ధమే కాదు.. తమ ఉనికి కోసం ముద్దుగుమ్మలు పడుతున్న పాట్లు కూడా. మరి ఎవరి కెరీర్ నిలబడుతుంది? ఎవరు బోర్డు తిప్పేస్తారు?
మృణాల్ ఠాకూర్.. సీతమ్మ ‘డెకాయిట్’గా మారితే సెట్ అవుతుందా?
ఇప్పటివరకు గ్లిజరిన్ సీన్లతో, ఎమోషనల్ యాక్టింగ్‌తో ‘సీతమ్మ’ అనిపించుకున్న మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు రూటు మార్చింది. అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ అంటూ రఫ్ అండ్ టఫ్ రోల్‌లో రాబోతోంది. క్లాస్ పాత్రలకు ఓకే కానీ, ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మృణాల్‌కు సెట్ అవుతుందా? అనేదే అసలు డౌట్. ఒకవేళ ఈ ప్రయోగం బెడిసికొడితే.. అమ్మడి ‘గోల్డెన్ హ్యాండ్’ ఇమేజ్ గాలిలో కలిసిపోవడం ఖాయం. యాక్షన్ క్వీన్ అవ్వాలని చూస్తున్న మృణాల్ ఆశలు నెరవేరుతాయా? లేక పాత సీతమ్మే ముద్దు అంటారా?
నభా నటేష్.. ‘స్వయంభు’తో ఆఖరి పోరాటం
ఒకప్పుడు ‘ఇస్మార్ట్’ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన నభా నటేష్.. ఇప్పుడు కెరీర్ డెడ్ ఎండ్‌లో ఉంది. చేతిలో ఒక్క సినిమా కూడా లేక దాదాపు ఖాళీగా ఉంటున్న నభాకు నిఖిల్ ‘స్వయంభు’ లాస్ట్ హోప్. ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి నభా పెర్ఫార్మెన్స్ ఏమాత్రం తేడా కొట్టినా.. టాలీవుడ్‌లో అమ్మడికి బోర్డు తిప్పేయాల్సిందే. ఈ సినిమా రిజల్టే నభా కెరీర్‌కు ‘ఎండ్ కార్డ్ ‘ అవుతుందో లేక ‘లైఫ్ లైన్’ అవుతుందో చూడాలి.
సంయుక్త మీనన్.. గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అవుతుందా?
ఇప్పటివరకు చేసినవన్నీ హిట్టే అని ‘గోల్డెన్ లెగ్’ ట్యాగ్ తగిలించుకున్న సంయుక్త మీనన్.. ఇప్పుడు అదే ‘స్వయంభు’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పీరియాడిక్ ఫిలిమ్స్ అంటే రిస్క్ ఎక్కువ. ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయితే.. ఇప్పటివరకు సంపాదించుకున్న ఆ ‘హిట్ సెంటిమెంట్’ గాలిలో కలిసిపోవడం ఖాయం. గోల్డెన్ లెగ్ ట్యాగ్‌ను కాపాడుకుంటుందా? లేక మొదటి ప్లాప్ రుచి చూసి ఐరన్ లెగ్ అనిపించుకుంటుందా?
భాగ్యశ్రీ బోర్సే.. ‘లెనిన్’ నమ్ముకున్న బ్యాడ్ లక్ బ్యూటీ!
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చీ ఇవ్వగానే ‘ప్లాప్ హీరోయిన్’ అనే ముద్ర పడిపోయింది భాగ్యశ్రీ బోర్సేకి. నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. ఇప్పుడు అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమాను నమ్ముకుంది. పాపం.. అఖిల్‌కే సరైన హిట్ లేని ఈ టైంలో.. భాగ్యశ్రీకి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని అనుకోవడం కాస్త ఎక్కువేనేమో.ఈ సినిమా హిట్ అయితేనే భాగ్యశ్రీ ఇక్కడ కనిపిస్తుంది..లేదంటే ప్యాకప్ చెప్పి సర్దుకోవడమే.
చూడాలి మరి ఈ సమ్మర్ రేసులో మృణాల్, నభా, భాగ్యశ్రీలలో ఎవరు ‘సమ్మర్ క్వీన్’ అవుతారు? ఎవరి కెరీర్ క్లోజ్ అవుతుందో .