E-Paper
Advertisement

Tollywood Industry Weddings: టాలీవుడ్లో మొదలైన పెళ్లి సందడి.. ఏకంగా 3 జంటలు

Tollywood Industry Weddings: టాలీవుడ్లో మొదలైన పెళ్లి సందడి.. ఏకంగా 3 జంటలు
Advertisement

Tollywood Industry Weddings: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న జంటలు ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పెళ్లి హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన మూడు జంటలు వరుసగా పెళ్లి బంధంతో ఒకటి కావడానికి సిద్ధమవుతున్నారు. మరి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఆ కొత్త జంటలు ఎవరు? ఏంటీ? అనే విషయానికి వస్తే..

విజయ్ దేవరకొండ – రష్మిక:

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ వేడుక అని చెప్పాలి. గత కొంతకాలంగా వీరు పెళ్లి గురించి ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. రూమర్లను నిజం చేస్తూ ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

అల్లు శిరీష్ – నైనిక రెడ్డి:

Advertisement

టాలీవుడ్ మరో యంగ్ హీరో అల్లు శిరీష సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా శిరీష్ గౌరవం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు . ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన శిరీష్ వ్యక్తిగత జీవితంలో కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు గత రెండు సంవత్సరాలుగా నైనిక రెడ్డితో ప్రేమలో ఉన్న ఈయన మార్చి 6వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ జంట గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

పునర్నవి -హేమంత్ వర్మ:

పునర్నవి భూపాలం నటిగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సినిమాల కంటే కూడా బిగ్ బాస్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇటీవల తన ప్రియుడు హేమంత్ వర్మతో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి వివాహం మార్చి 20వ తేదీ జరగబోతోంది .ఇక హేమంత్ వర్మ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది .

Advertisement

ఈ మూడు జంటలు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ రష్మిక జంట కుటుంబ సభ్యులతో కలిసి ఉదయపూర్ చేరుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహపు వేడుకలు 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి.

Also Read: Priyanka Chopra: బాలీవుడ్ పై ప్రియాంక హాట్ కామెంట్స్.. తొక్కేసే ప్రయత్నాలంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×