E-Paper
Advertisement

Slimmest Wet Dry Cleaner: వచ్చేసింది సరికొత్త పెన్సిల్ క్లీనర్.. నిమిషాల్లో మీ ఇళ్లంతా ఊడ్చి, తడిగుడ్డ పెట్టేస్తుంది!

Slimmest Wet Dry Cleaner: వచ్చేసింది సరికొత్త పెన్సిల్ క్లీనర్.. నిమిషాల్లో మీ ఇళ్లంతా ఊడ్చి, తడిగుడ్డ పెట్టేస్తుంది!
Advertisement

Slimmest Wet Dry Cleaner: చిన్న పిల్లలున్న ఇంట్లో క్లీనింగ్ అనేది చాలా పెద్ద సమస్య. ఉదయం లేచింది మొదలు వాళ్లు ఇల్లంతా తిరుగుతూ బయటి మట్టిని లోపలికి తేవడం, ఏదో ఒకటి ఒలకబోయడం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఆడవాళ్లు పదే పదే ఇంటిని తుడుచుకుంటూనే ఉండాలి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే డైసన్ సంస్థ ‘Dyson PencilWash’ను తీసుకొచ్చింది. కేవలం 2.2 కిలోల బరువుతో, పెన్సిల్‌ లాంటి సన్నని హ్యాండిల్‌తో ఉండే ఈ క్లీనర్.. మంచాల కింద, సోఫాల చాటున ఉన్న మురికిని కూడా చిటికెలో మాయం చేస్తుంది. ఇల్లు ఊడవడం, తడిగుడ్డ పెట్టడం లాంటి పనులను ఇది ఎంతో సులభంగా చేసేస్తోంది.

 2.2 కిలోల బరువు మాత్రమే:

గతంలో మనం వాడిన వెట్ అండ్ డ్రై క్లీనర్లు కాస్త బరువుగా ఉండేవి. కానీ ఈ డైసన్ పెన్సిల్‌వాష్ కేవలం 2.2 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. అలాగే ఇది నేలపై ఉన్న తడి చెత్తను, పొడి చెత్తను ఒకేసారి శుభ్రం చేయగలదు. ఇంటి మూలల్లో ఉన్న మురికిని, ఫర్నిచర్ కింద ఉన్న ఇరుకైన ఖాళీలను క్లీన్ చేయడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్లీనర్‌ను 170 డిగ్రీల వరకు వంచుకోవచ్చు. దీంతో నేలకు ఆనుకుని ఉండే మంచాలు లేదా సోఫాల కింద ఉన్న మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!

హైజీనిక్ టెక్నాలజీ:

ఈ పెన్సిల్ వాష్‌లో ఫిల్టర్లు లేని డిజైన్‌ను డైసన్ ఉపయోగించింది. సాధారణంగా ఫిల్టర్లలో ధూళి పేరుకుపోయి చెడు వాసన వస్తుంటుంది. కానీ పెన్సిల్‌వాష్‌లో ఆ సమస్య ఉండదు. దీనిలో ఉండే ప్రత్యేకమైన మైక్రోఫైబర్ రోలర్ సెంటీమీటరుకు 64,000 ఫిలమెంట్లను కలిగి ఉండి, మొండి మరకలను సైతం వదిలిస్తుంది. ఎప్పటికప్పుడు తాజా నీటితోనే క్లీనింగ్ జరిగేలా, మురికి నీరు వెంటనే వేరు చేయబడేలా ఈ పరికరంలో అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

30 నిమిషాల పాటు:

Advertisement

ఒక్కసారి ఈ క్లీనర్‌లో నీటిని నింపితే దాదాపు 100 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని క్లీన్ చేయగలదు. ఇందులోని బ్యాటరీ 30 నిమిషాల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అవసరమైతే బ్యాటరీని మార్చుకునే సదుపాయం కూడా ఉండటం వల్ల పెద్ద పెద్ద ఇళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 300 ఎంఎల్ వాటర్ ట్యాంక్ సామర్థ్యంతో వచ్చే ఈ క్లీనర్.. గృహ అవసరాలకు బాగా సెట్ అవుతుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతానికి కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే విడుదలైన ఈ పెన్సిల్‌వాష్ ధరను డైసన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. భారతదేశంలో దీని లాంచ్ గురించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీతో పాటు సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు ఈ సరికొత్త క్లీనర్‌ను కొనుగోలు చేయొచ్చు.

Also Read: బ్లూటూత్ యుగంలోనూ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు తగ్గని క్రేజ్.. అసలు కారణాలు తెలిస్తే?

Related News

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

Big Stories

Advertisement
×