E-Paper
Advertisement

Tollywood Movies : సీక్వెల్స్ కు 41 చిత్రాలు రెడీ..ఆ సినిమాలన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి..!

Tollywood Movies : సీక్వెల్స్ కు 41 చిత్రాలు రెడీ..ఆ సినిమాలన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి..!
Advertisement

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో వచ్చిన భారీ యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.. అయితే ఆ సినిమాలకు ఈమధ్య సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వల్ గా వచ్చి మరోసారి భారీ విషయాన్ని సొంతం చేసుకున్నాయి.. బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్ కొడితే చాలు, దానికి పార్ట్-2, పార్ట్-3 అంటూ సీక్వెల్స్ క్యూ కడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ నడుస్తుంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 41 సినిమాలు సీక్వెల్స్ లిస్టులో ఉన్నాయి. మరి ఆ లిస్టులో ఉన్న సినిమాలు ఏవో ఒకసారి మనం చూసేద్దాం..

భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు..

మూవీ లవర్స్ ప్రస్తుతం ఎదురుచూస్తున్న సీక్వెల్స్ లిస్టు చాలా పెద్దదే అని చెప్పాలి. ఆ సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలో ఉండడం విశేషం. ప్రభాస్ గతంలో నటించిన సలార్ 2, కల్కి 2, రాజా సాబ్ 2 ఉండగా.. అల్లు అర్జున్ ‘పుష్ప 3’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్ పార్క్’, ‘కేజీఎఫ్ 3’, ‘విక్రమ్ 2’, ‘ఖైదీ 2’, ‘జైలర్ 2’ వంటి సూపర్ హిట్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఈ సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన సినిమాలు గతంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. వీటికి సీక్వల్ గా మరో సినిమాను చూసేందుకు టాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఒక్కొక్క సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశం కూడా ఉంది.

Advertisement

Also Read : బిగ్ బాస్ లో జరిగేది ఇదే.. కన్నీళ్లు తెప్పిస్తున్న శ్రీజ స్టోరీ..

డిఫరెంట్ జోనర్స్ – ఓరియెంటెడ్ మూవీస్.. 

భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో పాటుగా డిఫరెంట్ జోనల్లో రాబోతున్న సినిమాలు కూడా కొన్ని సీక్వెల్స్ కి రెడీగా ఉన్నాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు తో పాటుగా మరికొన్ని ఓరియంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ చిత్రాలు కూడా సీక్వెల్స్ బాట పట్టాయి. ‘కార్తికేయ 3’, ‘విరూపాక్ష 2’, ‘మంగళవారం 2’, ‘జాంబీ రెడ్డి 2′ లతో పాటుగా.. నాని హిట్ 4, జై హనుమాన్, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా 2,గుూఢచారి 2’, ‘ఈగల్ 2’, ‘కేఏ 2’ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా సీక్వెల్స్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట బాగానే వైరల్ అవుతుంది. మరి సీక్వల్ గా రాబోతున్న సినిమా ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాల్సి ఉంది.. ఇక ఏడాది సంక్రాంతి సినిమాలో మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం మార్చిలో స్టార్ హీరోలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో ఏ సినిమా బాక్సాఫీస్ హిట్టుగా నిలుస్తుందో చూడాలి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×