Gadchiroli Encounter: మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో ఒక మావోయిస్టు మహిళా నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఘటనలో c60 కమాండో ఒకరు గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన జవాన్ ను ప్రత్యేక హెలికాప్టర్లో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులకు చెందిన ‘కంపెనీ నెంబర్ 10’ సభ్యులు గడ్చిరోలి జిల్లాలోని భామ్రగడ్ ప్రాంతంలో సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నేతృత్వంలో రాత్రి సెర్చ్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు ప్రారంభించాయి.
జరిగిన కాల్పుల్లో మావోయిస్టుల రెండు క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఎదురు కాల్పులు తీవ్రం కావడంతో ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. గురువారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో 60 జవాన్ కు బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం. వెంటనే మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్, ఎస్ ఎల్ ఆర్, మావోయిస్టులకు చెందిన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర-చత్తీస్గడ్ సరిహద్దుల్లోని గచ్చిరౌలి జిల్లా భామ్రగడ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సైతం భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు వెంటాడుతున్నాయి. వివిధ కేడర్లలో ఉన్న మావోయిస్టులను సరెండర్ చేసుకుంటూనే, భద్రతా బలగాలకు ఎదురు తిరుగుతున్న మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతూ ఎన్కౌంటర్లలో మట్టు పెడుతున్నారు. తాజాగా జనవరి 25 26 తేదీల్లో గడ్చిరోలి జిల్లా కోల మరక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అగ్ర నేతలు వర్గీస్, మగ్త్, కుర్సంగు రాజు, కుడిమెట్ల వెంకటేష్ మృతి చెందారు. ఈ నలుగురిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 36 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రస్తుతం ఫోడేవాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా భద్రతా బలగాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో డి బి సి ఎం మెంబర్లు వర్గీస్, మగ్త్ లకు రూ.16 లక్షల చొప్పున, ఫ్లాటు మెంబర్స్ కుర్సాంగ్ రాజు, కుడి మిట్ట వెంకటేష్ లకు చెరో రూ.2లక్షల చొప్పున రివార్డు ఉంది.
Also Read: India GCC FTA: గ్లోబల్ మార్కెట్‌లో భారత్ గర్జన.. అమెరికాతో బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం సిద్ధం!