E-Paper
Advertisement

తెలుగు ఇండస్ట్రీకి కలిసిరాని 2026 సమ్మర్.. నష్టం భరించాల్సిందేనా?

తెలుగు ఇండస్ట్రీకి కలిసిరాని 2026 సమ్మర్.. నష్టం భరించాల్సిందేనా?
Advertisement

Tollywood: ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో సమ్మర్ హాలిడేస్ కూడా నిర్మాతలకు అంతే లాభాలను చేకూరుస్తాయి. అందులో భాగంగానే అటు నిర్మాతలు, దర్శక హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలి అనుకుంటే ఎక్కువగా సెలవు దినాలనే టార్గెట్గా చేసుకుంటూ ఉంటారు. అందుకే సంక్రాంతి తప్పిందంటే సమ్మర్ హాలిడేస్ కి పక్కా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఈసారి బడా సినిమాలు సమ్మర్ కి రావాల్సింది పోయి కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అయ్యే సమయంలో విడుదలకు సిద్ధమవుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

పెద్ద హీరోలు వేసవికి రానట్టేనా?

గత సంవత్సర కాలంగా సమ్మర్ కి తెలుగు సినిమాల సందడి జోరుగా సాగుతుంది అని తెగ ప్రగల్బాలు పలికారు కానీ ఈ వేసవికి పెద్ద సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వాయిదాల పర్వం నడుస్తోంది..ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ కళ తప్పుతోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడుతుంటే తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఏడాది సమ్మర్ అసలు కలిసి రావడం లేదు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వాయిదాల పర్వం.. తప్పుతున్న సినిమా కళ..

Advertisement

తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే..తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత లాభదాయకమైన వేసవి సీజన్ ప్రస్తుతం వాయిదాల పర్వంతో చతికిల పడుతోంది.. ఒకప్పుడు వేసవి సెలవులు అంటే అగ్రతారాల సినిమాలతో థియేటర్లు కళకళలాడేవి. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం ఏర్పడడం, షూటింగ్ ఆలస్యం వంటి కారణాలవల్ల పెద్ద సినిమాలు చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నాయి. దీనివల్ల వాటిని నమ్ముకున్న చిన్న సినిమాలు కూడా గందరగోళంలో పడి విడుదల తేదీలను మార్చుకోవాల్సి వస్తోంది.

also read:షూటింగ్ మొదలుపెట్టనే లేదు.. అప్పుడే అనిల్ – వెంకీ మూవీకి భారీ బిజినెస్!

అందుకే పెద్ద సినిమాలు వాయిదా..

Advertisement

నిజానికి ఈ సమ్మర్లో రామ్ చరణ్ పెద్ది, నాని ది పారడైజ్ వంటి క్రేజీ ప్రాజెక్టులు వాయిదా పడడం బాక్సాఫీస్ పై పెద్ద ప్రభావం చూపింది. చిరంజీవి విశ్వంభర చిత్రాల విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కోసం చిత్ర బృందాలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. నాణ్యత విషయంలో కూడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీలను పదేపదే మారుస్తూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. దీనికి తోడు థియేటర్ల యజమానుల సమస్యలు , సమ్మె హెచ్చరికలు పరిశ్రమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. వేసవి వంటి కీలకమైన సీజన్ ను వృధా చేసుకోవడం వల్ల చిత్ర పరిశ్రమ భారీగా ఆదాయాన్ని కూడా కోల్పోతోంది. సంక్రాంతి సీజన్ పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.. దీనివల్ల సినిమాల మధ్య పోటీ పెరిగి వసూళ్లపై దెబ్బ పడుతుందని చెప్పాలి.. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జూన్ తర్వాతే బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలయ్యేలా కనిపిస్తోంది..

చిన్న చిత్రాలకు భారీ ఊరట..

మరోవైపు సమంత మా ఇంటి బంగారం, నిఖిల్ స్వయంభు వంటి చిత్రాలు మాత్రం త్వరలో రానున్నాయి. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ప్రేక్షకులు వేసవి వినోదానికి దూరం అవుతున్నారని తెలుస్తోంది. ఇక అలా ఈ ఏడాది సినిమాలు వాయిదా పడడం వల్ల ఈ సమ్మర్ పెద్ద హీరోలకు కలిసి రావడం లేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×