E-Paper
Advertisement

Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్

Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్
Advertisement

Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ ఆరా తీశారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న ప్రధాని, నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ, ఆయనకు ఆదివారం ఉదయం ఫోన్ ఫోన్ చేశారు. శ్వాస కోస సమస్య కారణంగా ఆపరేషన్ చేయించుకున్న పవన్‌ను ప్రధాని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని పవన్‌ను ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు.

పవన్ ఆరోగ్యం గురించి ఆరా..  వేగంగా కోలుకోవాలని ఆకాంక్ష

Advertisement

శుక్రవారం ఉదయం వివిధ అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దినెలలుగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పవన్ వ్యక్తిగత వైద్యులు పరీక్షించారు. వారి సలహాతో శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య బృందం పవన్‌ను పరీక్షించిన ఆపరేషన్ నిర్వహించారు. కోలుకోవడానికి వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరమని తెలిపారు.  ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని తెలిపారు వైద్యులు. దీర్ఘకాలం జాగ్రత్తలు తీసుకోవాలని తగిన సమయం పడుతుందంటూ జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.

ALSO READ: ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

కొన్నాళ్లుగా పవన్‌కల్యాణ్ సైనసైటిస్‌‌తో ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో ముక్కుకు ఆపరేషన్‌ చేసినట్లు సమాచారం. పవన్‌కు సర్జరీ విజయవంతం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్ పలువురు రాజకీయ నేతలు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×