E-Paper
Advertisement

షూటింగ్ మొదలుపెట్టనే లేదు.. అప్పుడే అనిల్ – వెంకీ మూవీకి భారీ బిజినెస్!

షూటింగ్ మొదలుపెట్టనే లేదు.. అప్పుడే అనిల్ – వెంకీ మూవీకి భారీ బిజినెస్!
Advertisement

Anil Ravipudi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హిట్ మిషన్ గా పాపులారిటీ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి(Chiranjeevi)తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి రీజినల్ ఇండస్ట్రీ హిట్టు కొట్టారు. ఇక ప్రస్తుతం ఎవరూ ఊహించని కాంబినేషన్ ను తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అలా వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది . త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే షూటింగ్ ఇంకా మొదలవ్వకుండానే బిజినెస్ కూడా జరిగిపోయింది.

భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ, సాటిలైట్ హక్కులు..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram) తో చేస్తున్న సినిమాకి డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ Zee డిజిటల్, శాటిలైట్ హక్కులను 70 కోట్లకు సొంతం చేసుకున్నారు. వాస్తవానికి కళ్యాణ్ రామ్, వెంకటేష్ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి.. కానీ కేవలం అనిల్ రావిపూడిని నమ్మి ఇంత పెట్టి కొనుక్కున్నారని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మకం చర్చనీయాంశంగా మారింది.

ఆయనపై భరోసానేనా..

Advertisement

వాస్తవానికి అనిల్ రావిపూడి సినిమా అంటేనే మినిమం హిట్ గ్యారెంటీ.. దీనికి తోడు సంక్రాంతికి వచ్చిందంటే భారీ కలెక్షన్లు ఖాయం.. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్, కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులు అన్నీ కలగలిపితే ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఇప్పట్లో అందరిలో మొదలైంది. కచ్చితంగా ఈ సినిమా హిట్టు కొడుతుందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ రేంజ్ లో ఓటిటి , సాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది..ఏది ఏమైనా ఇంకా షూటింగ్ మొదలుకాకముందే నిర్మాత సాహు గారపాటికి భారీగా లాభాలు తెచ్చిపెడుతోందని చెప్పాలి. అంతేకాదు అనిల్ రావిపూడి కూడా నిర్మాతల పాలిట బంగారుబాతులా మారిపోయారు అనడంలో సందేహం లేదు.

also read:స్టార్ హీరో ఫ్రెండ్ కోసం సీఐడీ అధికారులు వెతుకులాట.. దొరికితే అరెస్ట్?

అనిల్ రావిపూడి కెరియర్..

Advertisement

అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన ఎక్కువగా కామెడీ , ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని సినిమాలు చేస్తూ.. వరుసగా విజయాలను అందుకుంటున్నారు. అలా సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్3 , గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమా కూడా మంచి కలెక్షన్లను అందించింది . ఇక గత ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ కాగా ఈ ఏడాది వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే నిర్మాతలకు గోల్డెన్ డక్ గా మారిపోయారు అనిల్ రావిపూడి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×