E-Paper
Advertisement

Tollywood star heroes’ wives: బిజినెస్ రంగంలో రాణిస్తున్న తెలుగు స్టార్ హీరోల భార్యలు వీళ్లే..!

Tollywood star heroes’ wives: బిజినెస్ రంగంలో రాణిస్తున్న తెలుగు స్టార్ హీరోల భార్యలు వీళ్లే..!
Advertisement

Tollywood star heroes’ wives: టాలీవుడ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో వేగంగా ఎదుగుతోంది. మన హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ భారీ మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే వారు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. వ్యాపారాలు, పెట్టుబడులు, టీవీ కార్యక్రమాలు వంటి రంగాల్లో కూడా ముందుకు వెళుతున్నారు. అదే విధంగా వారి భార్యలు కూడా తమదైన రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

నమ్రతా శిరోద్కర్ (మహేష్ బాబు)

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం మహేష్ బ్రాండ్ వ్యవహారాలు, ఏఎంబీ సినిమాస్, అలాగే టెక్స్‌టైల్ మరియు ఫుడ్ బిజినెస్‌లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్నేహా రెడ్డి (అల్లు అర్జున్)

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆమె ఒక విద్యా సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనంగా ఫోటోగ్రఫీ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు.

ఉపాసన కామినేని (రామ్ చరణ్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆరోగ్య రంగంలో ఆమె ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అలాగే హెల్త్ మాగజైన్.. ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు.

లక్ష్మీ ప్రణతి (ఎన్టీఆర్)

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎక్కువ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తారు. అయితే త్వరలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంజన (నాని)

నేచురల్ స్టార్ నాని సతీమణి అంజన ఆర్కే మీడియా వర్క్స్‌లో క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. పలు ప్రముఖ చిత్రాల నిర్మాణంలో ఆమె భాగమయ్యారు.

విరూప (అల్లరి నరేష్)

అల్లరి నరేష్ భార్య విరూప ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె తన వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు.

మొత్తంగా చూస్తే మన స్టార్ హీరోల భార్యలు కూడా తమ ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వ్యాపారం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో విజయాలు సాధిస్తూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నారు.

ALSO READ: Star Heroine: ఎనిమిదేళ్ల నుంచి వాట్సాప్‌ వాడడం మానేసిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×