E-Paper
Advertisement

Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి

Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి
Advertisement

Telangana Paddy Procurement: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ధాన్యం సేకరణ, బకాయిల విడుదల తదితర కీలక అంశాలపై కేంద్ర మంత్రికి వారు వినతిపత్రం సమర్పించారు. 2025-26 వానాకాలం పంటకు సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) తీసుకోవాలని కోరారు. వానాకాలం పంట సేకరణకు గతంలో 53.73 లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చారని, అయితే దిగుబడి పెరగడంతో అదనంగా సేకరించిన మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ సేకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం 2024-25 వానాకాలం పంట కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సరఫరాకు ఫిబ్రవరి 28 వరకు ఉన్న గడువును మరో రెండు నెలల పాటు పొడిగించాలని విన్నవించారు. రాష్ట్రంలో మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఈ గడువు పెంపు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 2014-15 వానాకాలం సీజన్‌లో ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాడు అదనపు లెవీ సేకరణ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని, ఆ రుణంపై వడ్డీయే రూ. 2 వేల కోట్లకు పైగా పెరిగిందని వివరించారు. వీటితో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్ల బకాయిలను కూడా చెల్లించాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ధాన్యం సేకరణ, నిధుల విడుదలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×