E-Paper
Advertisement

Star Heroine: ఎనిమిదేళ్ల నుంచి వాట్సాప్‌ వాడడం మానేసిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..!

Star Heroine: ఎనిమిదేళ్ల నుంచి వాట్సాప్‌ వాడడం మానేసిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..!
Advertisement

Star Heroine: ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, తరువాత సోషల్ మీడియా, ఆ తరువాత రీల్స్ చూడటం అలవాటుగా మారింది. ఎంత సమయం గడుస్తుందో కూడా తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ రాజిషా విజయన్ మాత్రం చాలా భిన్నమైన జీవనశైలిని ఎంచుకున్నారు.

వాటన్నిటికీ దూరమే..!

మలయాళం, తమిళంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజిషా విజయన్ చెప్పిన ప్రకారం, ఆమె గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్ ఉపయోగించడం లేదంట. కాలేజ్ పూర్తి చేసిన తరువాత ఫేస్‌బుక్ కూడా పూర్తిగా వాడడం మానేశారంట. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తారు. ఆమెకు వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితమే ముఖ్యమని భావిస్తారంట.

Advertisement

ఆమె మాట్లాడుతూ..” మనుషులను ప్రత్యక్షంగా కలవడం చాలా విలువైన విషయం. ఫోన్ కాల్స్ లేదా మెసేజీల కంటే ముఖాముఖి మాట్లాడటం ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది అని నేను భావిస్తాను. రీల్స్ వల్ల చాలా మంది ఫోన్‌కు బానిసవుతున్నారు. సమయం ఎంత ముఖ్యమో మనం గుర్తించలేకపోతున్నాము,” అని అన్నారు.

ఆ సమయంలో ఇలా చేయండి..

“ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికి ఉపయోగించవచ్చు. మంచి సినిమాలు చూడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపవచ్చు,” అని రాజిషా తెలిపారు. సోషల్ మీడియా మన సమయాన్ని మెల్లగా తీసుకుపోతుందని ఆమె హెచ్చరించారు.

Advertisement

ఇక ఈ ఆమె ఈ మధ్యనే మమ్ముట్టి సూపర్ హిట్ సినిమా కలం కావాలి సినిమాలో హీరోయిన్గా చేసింది. గురించి కూడా మాట్లాడారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించినది Jithin K Jose. అలాగే నటుడు Vinayakan కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మమ్ముట్టి గారి కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచింది.

సినిమా గురించి మాట్లాడిన రాజిషా, “మమ్ముట్టి సర్ తన పాత్రలో చాలా సహజంగా మారిపోతారు. ఈ చిత్రంలో ఆయన స్టాన్లీ దాస్ అనే సీరియల్ కిల్లర్ పాత్ర పోషించారు. ఆయన ఎప్పుడు పాత్రలోకి వెళ్లారో నేను గమనించలేకపోయాను. ఆయనతో కలిసి నటించడం నాకు ఒక గొప్ప అనుభవం. ఇది నాకు పెద్ద పాఠంగా మారింది,” అని అన్నారు.

ALSO READ: Mega Director: మెగా దర్శకుడిని దూరం పెడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకంటే..?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×