E-Paper
Advertisement

ఫోన్ లో చూసే సినిమాకు 500 టికెట్ ఎందుకు.. టాలీవుడ్ మేకర్స్ పై రాహుల్ రామకృష్ణ సెటైర్స్

ఫోన్ లో చూసే సినిమాకు 500 టికెట్ ఎందుకు.. టాలీవుడ్ మేకర్స్ పై రాహుల్ రామకృష్ణ సెటైర్స్
Advertisement

Ticket Prices : ఒకప్పుడు సినిమా అంటే మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఉండే ఎంటర్ టైన్ మెంట్…కానీ ఇప్పుడు అదే సినిమాని ఫ్యామిలీ అంతా కలసి చూడాలంటే స్పెషల్ గా బడ్జెట్ కేటాయించుకోవాల్సిన పరిస్థితి.ఇక ఏ సినిమా రిలీజ్ అయినా వాటి టికెట్ల రేట్ల పైనే హాట్ హాట్ డిస్కషన్. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ఎదో రకంగా ప్రభుత్వాలనుండి ప్రత్యేకంగా పర్మిషన్లు తెచ్చుకోవడం, పెరిగిన ధరలని ఆడియన్స్ జేబుల్లోంచి లాగేయడం మేకర్స్ కి అలవాటై పోయింది. ఇక ఇదే ఇష్యూపై తాజాగా టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా ‘అద్భుతం’ కాకపోతే రేటు ఎందుకు?

Advertisement

ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రప్పించాలంటే మేకర్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్బుతాలు చేయాలని,అలా కాకుండా ఫోన్ లోనే చూడగలిగే మామూలు కంటెంట్ నే తీస్తామంటే ఆడియన్స్ అసలెందుకు థియేటర్లోకి రావాలంటూ ప్రశ్నించాడు. అసలే కరోనా పుణ్యమాని వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేసింది, ఎంచక్కా ఆడియన్స్ సోఫాలో కూర్చుని మెచ్చిన సినిమాని నచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో చూస్తున్నారు.ఇలాంటి సమయంలో మేకర్స్ తమ సినిమాలో ఏదైనా మ్యాజిక్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్ల వైపు చూస్తారు.ఆ పని చేయకుండా కంటెంట్ లెస్ సినిమాలు తీసి ఆడియన్స్ జేబులకి చిల్లులు పెట్టె అధికారం ఎవరికీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

also read :

Advertisement

సామాన్యుడి కష్టాలు.. థియేటర్ల గండాలు

ఇక థియేటర్లకి కామన్ మ్యాన్ రావాలంటే టికెట్ల రేట్లు ఒక్కటే సమస్య కాదని, మండే ఎండలు, నరకం చూపించే ట్రాఫిక్, పార్కింగ్ ప్రాబ్లమ్స్ ,ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ రేట్లు .. వీటన్నింటినీ దాటుకుని థియేటర్ లోపలికి వెళ్తే, అక్కడ అంతకు మించి అన్నట్టుగా స్నాక్స్ రేట్లు.వీటితో పాటు ఒక పాప్‌కార్న్, కూల్ డ్రింక్ కొనాలంటే వందల రూపాయలు కుమ్మరించాల్సిందే.ఇక ఇన్ని అడ్డంకులను దాటుకుని వచ్చే ఆడియన్ కోరుకునేది జస్ట్ రెండున్నర గంటల ఎంటర్ టైన్ మెంట్.మరి థియేటర్లో కూర్చున్నఆడియన్ కి అది కూడా సరిగ్గా ఇవ్వలేనప్పుడు థియేటర్లు ఖాళీగా ఉండటంలో ఆశ్చర్యమే లేదని మనసులోని మాటని బయటపెట్టాడు ఈ వెర్సటైల్ యాక్టర్.

ఓవర్సీస్ లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ ఎఫెక్ట్!

ఇకపొతే  రాహుల్ అన్నట్టుగానే  ఈ మధ్య కాలంలోనే ఓవర్సీస్ మార్కెట్‌లో టికెట్ రేట్ల దోపిడీ మరీ ఎక్కువగా ఉందనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి.’RRR’రిలీజ్ అయిన టైమ్ లో మొదలైన ఈ ట్రెండ్, మొన్నటి ‘కల్కి 2898 AD’ వరకు కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఒక్కో టికెట్ ధర 30 డాలర్ల నుంచి 40 డాలర్ల వరకు (మన కరెన్సీలో సుమారు రూ. 2500 – 3500) పలుకడం అంటే మిడిల్ క్లాస్ కి అది తలకి మించిన భారమే.ఇక ‘పెద్ది ‘, ‘వారణాసి’, ‘స్పిరిట్’,కల్కి 2 వంటి రాబోయే బడా సినిమాలకి కూడా ఇదే రేంజ్ ప్లాన్ చేస్తుండటంతో ఆడియన్స్ , ముఖ్యంగా ఎన్నారైలు నెట్టింట్లో తమ తమ   అసహనాన్నిబయటపెట్టేస్తున్నారు.అయితే బడా మేకర్స్ మేకింగ్ కాస్ట్ పెరిగిందని చెప్తుంటే, చిన్న నిర్మాతలు మాత్రం ఈ రేట్ల వల్ల జనం థియేటర్లకు రావడం మానేస్తున్నారని, దీనివల్ల చిన్న సినిమాలు బలైపోతున్నాయని వాపోతున్నారు.

also read :APFDC చైర్మన్‌గా భరత్ భూషణ్..అభినందించిన నటసింహం !

కంటెంట్ ఉంటేనే కాసులు

కానీ రియాలిటీ ఏంటంటే’బేబీ’, ‘హనుమాన్’ వంటి సినిమాలు టికెట్ రేట్లు కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్నప్పుడే బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాగే ‘కోర్ట్’, ‘మ్యాడ్’, ‘కమిటీ కుర్రోళ్లు’,ఆయ్ వంటి సినిమాలు కంటెంట్ ఉంటే ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారని ప్రూవ్ చేశాయ్ కూడా. ఏది ఏమైనా రాహుల్ రామకృష్ణ అన్నట్లుగా, ప్రేక్షకుడు ఇప్పుడు చాలా తెలివైనవాడు. కేవలం స్టార్ పవర్ చూసో, గ్రాఫిక్స్ చూసో మోసపోవడానికి అస్సలు సిద్ధంగా లేడు. అతని సమయానికి, డబ్బుకు విలువనిచ్చే గొప్ప సినిమాలు వస్తేనే ఇంట్లోంచి థియేటర్ లోకి అడుగుపెడతాడు.అలా కాకుండా కంటెంట్ పై ఫోకస్ చేయకుండా రేట్లని పెంచుకుంటూ పొతే థియేటర్స్ కాస్తా కళ్యాణ మండపాలు అవ్వడం ఖాయం.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×