E-Paper
Advertisement

దేశవ్యాప్తంగా జులై 1 నుండి కొత్త చట్టం అమలు.. పాత పేరుకు కేద్రం స్వస్తి!

దేశవ్యాప్తంగా జులై 1 నుండి కొత్త చట్టం అమలు.. పాత పేరుకు కేద్రం స్వస్తి!
Advertisement

BT-3 Seeds: స్వేచ్చ బ్యూరో: రెండు దశాబ్దాలుగా ఉపాధి కల్పనకు కొనసాగుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA) స్థానంలో మరింత పటిష్టమైన చట్టాన్ని తీసుకురానుంది. ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-GRAM G Act) పేరుతో ఈ నూతన వ్యవస్థను రూపొందించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026 జులై 1వ తేదీ నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతుంది.

అదనంగా 25 రోజులు

మెరుగైన జీవనోపాధి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంజీనరేగా చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి లభిస్తోంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ కార్మికుల అవసరాలను గుర్తించిన కేంద్రం, పనిదినాల సంఖ్యను 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనంగా 25 రోజుల వేతనం కార్మికులకు లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం, గ్రామాల ఆర్థిక పురోభివృద్ధే ఈ నూతన చట్టం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ వివరించింది. 2026 జూన్ 30 నాటికి ఎంజీనరేగా కింద పురోగతిలో ఉన్న పనులన్నీ కొత్త చట్టం కిందకు బదిలీ అవుతాయి. ఎక్కడా పనులు ఆగిపోకుండా చర్యలు చేపడతారు.కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఇ-కేవైసీ పూర్తి చేసిన కార్డులే చెల్లుబాటు అవుతాయి. కొత్తగా ఉపాధి కోరుకునే వారు వెంటనే గ్రామ పంచాయతీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఇ-కేవైసీ లేకున్నా ఉపాధికి విఘాతం లేదు.

Advertisement

Also read: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. రూ. 9 లక్షల నగదుతో వెళ్తుండగా కాటేసిన కాలం

ఈ కొత్త చట్టం

చాలా చోట్ల ఇ-కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కార్మికులకు పని కల్పించే విషయంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కేవైసీ పూర్తి కాకపోయినా ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించింది. పారదర్శకతను పెంచడంతో పాటు, సాంకేతికతను జోడించి కూలీల వేతనాలను నేరుగా వారి ఖాతాల్లోకి మరింత వేగంగా చేరవేసేలా ఈ కొత్త చట్టం రూపకల్పన జరిగింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ‘వికసిత్ భారత్’ ఉపాధి చట్టం అమల్లోకి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Also read: మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు

Tags

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×