E-Paper
Advertisement

Tollywood Movies : ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..

Tollywood Movies : ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Tollywood Movies : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలావరకు ఇవాళ థియేటర్లలోకి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొత్త సినిమాలు సందడి, అలాగే ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తాయి. అదే విధంగా టీవీ ఛానెల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే ఈవారం థియేటర్లోకి రాబోతున్న సినిమాలపై కాస్త ఇంట్రెస్టింగ్ బజ్ఏర్పడింది. గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు కాని ఉన్న సినిమాలలో అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా లేవు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

గత వారంతో పోలిస్తే మే 15న రిలీజ్ కాబోతున్న సినిమాలు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. సూర్య నటిస్తున్న వీరభద్ర సినిమా మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమా ఏవో ఓ లుక్ వేద్దాం పదండీ..

వీర భధ్రుడు..

Advertisement

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు మూవీకి గత వారం అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ వారం అయిన ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.  కానీ విడుదల అవ్వలేదు.. తెలుగులో ‘ వీర భద్రుడు ‘ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే గురువారం సూర్య మూవీ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

మహారాజా..

2011లో జరిగిన మహారాజా అనే మూవీ ఇప్పుడు ముసలోడికి దసరా పండగ అనే పేరుతో తెలుగులో రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ ఈనెల 15న అంటే శుక్రవారం థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది. అంజలి, నాజర్, అనిత, కోవై సరళ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

హరుడు..

Advertisement

నిజానికి ఈ సినిమా గతవారం రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇది ఒక తెలుగు సినిమా.. హీరో వెంకట్ హీరోగా, నిర్మాతగా నటించారు. ఇక 90 బ్యాక్‌ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న సినిమా ‘దూరదర్శని’. సువిక్షిత్‌, గీతిక జంటగా నటించారు. కార్తికేయ కొమ్ము దర్శకత్వం వహించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్‌ హోమ్..

త్రిగుణ్‌, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. టైటిల్ కు తగ్గట్టుగానే స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.. ఈ శుక్రవారం థియేటర్లలోకి సినిమా రిలీజ్ కాబోతుంది.

వీటితో పాటుగా అరేయ్‌ ఆపండ్రా, రాక్షస పురం,కెడీ: ది డెవిల్‌ వంటి సినిమాలు కూడా థియేటర్లోకి రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కేవలం చిన్న సినిమాలు కావడంతో జనాలు వీటిని చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఈవారం థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.. మే నెలలో దాదాపు స్టార్ హీరోల సినిమాలు అయితే రిలీజ్ కాలేదు. జూన్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×