E-Paper
Advertisement

ఓటీటీలో మతి పోగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు… వీటిని చూస్తే వీకెండ్ క్రేజీగా

ఓటీటీలో మతి పోగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు… వీటిని చూస్తే వీకెండ్ క్రేజీగా
Advertisement

Best Crime Thriller Series on OTT : వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. చాలామందికి టైంపాస్ అవ్వడం కష్టం. రొటీన్ లవ్ స్టోరీలు, కామెడీలు చూసి బోర్ కొడితే, మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు చూడాల్సిందే. ట్విస్టుల మీద ట్విస్టులతో, సీటు అంచున కూర్చోబెట్టే టాప్ రేటింగ్ ఇంటర్నేషనల్ థ్రిల్లర్ సిరీస్‌ల లిస్ట్ ఇదిగో. వీటిని చూస్తే వీకెండ్ మామూలుగా ఉండదు, క్రేజీగా మారిపోద్ది. ఇవన్నీ కూడా జియో హాట్ స్టార్ లో ఎనిమిదికి పైగా రేటింగ్ తో అందుబాటులో ఉన్నాయి.

1. Mare of Easttown (2021) – మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్

ఒక చిన్న టౌన్‌లో ఒక అమ్మాయి దారుణంగా మర్డర్ అవుతుంది. ఇంకో అమ్మాయి ఏడాదైనా దొరకదు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ‘మేర్’ అనే లేడీ డిటెక్టివ్ రంగంలోకి దిగుతుంది. ఇందులో కేసు ఒక్కటే కాదు, ఆ డిటెక్టివ్ పర్సనల్ లైఫ్ కూడా ఒక పెద్ద డ్రామా. చివరి నిమిషం వరకు అసలు హంతకుడు ఎవడో ఊహించడం అసాధ్యం ఇందులో. కేట్ విన్స్లెట్ యాక్టింగ్ అయితే పిచ్చెక్కిస్తుంది.

2. Chernobyl (2019) – చెర్నోబిల్

Advertisement

1986లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది ఇది. ప్రమాదం ఎలా జరిగింది? దాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ఎలాంటి వేషాలు వేసింది? అనేది అసలు కథ. ఇది ఫిక్షన్ కాదు, రియల్ స్టోరీ. ఏ హర్రర్ సినిమాకు తీసిపోని రేంజ్‌లో భయపెడుతుంది. సిరీస్ చూస్తున్నంత సేపు గుండెల్లో వణుకు పుడుతుంది. ఐఎండిబిలో దీనికి మంచి రేటింగ్ ఉంది.

3. Sharp Objects (2018)– షార్ప్ అబ్జెక్ట్స్

ఒక ఊరిలో ఇద్దరు అమ్మాయిలు మాయమై చనిపోతారు. ఆ క్రైమ్ గురించి రిపోర్ట్ చేయడానికి ‘కామిల్లె’ అనే క్రైమ్ జర్నలిస్ట్ తన సొంత ఊరికి వెళ్తుంది. ఊరి వాళ్ల ప్రవర్తన, హీరోయిన్ ఫ్యామిలీ సీక్రెట్స్, ఆమెకున్న మానసిక సమస్యలు.. అన్నీ కలిసి మైండ్ కరాబ్ చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ. సైకలాజికల్ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకు ఇది పండగే.

4. The Night Of (2016) – ది నైట్ ఆఫ్

Advertisement

ఒక కాలేజ్ కుర్రాడు ఒక రాత్రి ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు. పొద్దున్న లేచి చూసేసరికి ఆ అమ్మాయి పక్కన రక్తం మడుగులో చనిపోయి ఉంటుంది. కేసు ఆ కుర్రాడి మీదికి వస్తుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే విషయం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇదొక గ్రిప్పింగ్ కోర్ట్‌రూమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. నిందితుడు నిజంగానే తప్పు చేశాడా లేదా అనే సస్పెన్స్ ఆఖరి వరకు నడుస్తుంది.

5. Watchmen (2019) – వాచ్‌మెన్

సూపర్ హీరోస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డార్క్ మిస్టరీ సిరీస్ ఇది. ఒక రేసిస్ట్ గ్రూప్ చేసే దాడుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది మామూలు యాక్షన్ సిరీస్ కాదు. ఇందులో పొలిటికల్ థ్రిల్లర్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కథ నడిచే విధానం చాలా కొత్తగా, కాంప్లెక్స్‌గా ఉంటుంది.

6. The Young Pope (2016) – ది యంగ్ పోప్

చరిత్రలోనే తక్కువ వయసులోనే అమెరికన్ పోప్‌గా లెన్ని బెలార్డో అనే వ్యక్తి వాటికన్ సిటీకి హెడ్ అవుతాడు. అతని రూటే వేరు.
వాటికన్ రాజకీయాలు, మతం వెనకాల ఉండే రహస్యాలను చాలా బోల్డ్‌గా చూపిస్తారు ఇందులో.

Read Also : ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పక చూడాల్సిన కొరియన్ సిరీస్ లు…

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×