E-Paper
Advertisement

లస్ట్ అండ్ లవ్ మధ్య నలిగిపోయిన స్పానిష్ అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీ

లస్ట్ అండ్ లవ్ మధ్య నలిగిపోయిన స్పానిష్ అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీ
Advertisement

Bold Movie on OTT : గట్టిగా బోల్డ్ సీన్స్ ఉండే అడల్ట్ డ్రామా చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయచ్చు. అయితే ఇది పెద్దలకి మాత్రమే. వాళ్ళు కూడా ఒంటరిగా చూడటం మంచిది. అయితే ఇది మజా కోసం తీసిన బొమ్మ సినిమా అయితే కాదు. ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. స్పెయిన్‌లో నివసించే వాలెరీ అనే ఫ్రెంచ్ యువతి కథ ఇది. ఆమెకు విపరీతమైన కామ కోరికలు ఉన్న కారణంగా, జీవితంలో ఆమె ఎదుర్కున్న సంఘటనలను ఇందులో చూపించారు. ఒకానొక దశలో ఆమెకు పెళ్లి జరిగినా, తారువాత వ్యభిచార కూపంలోకి దిగాల్సి వస్తుంది. చివరకు ఆ గలీజు ప్రపంచం నుండి ఆమె బయటపడి ఒక నార్మల్ జీవితాన్ని ఎలా స్టార్ట్ చేసింద నేదే ఈ సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే 

ఈ స్పెయిన్ ఎరోటిక్ డ్రామా సినిమా పేరు ‘డైరీ ఆఫ్ ఎ నింఫోమానియాక్’ (Diary of a Nymphomaniac). 2008లో వచ్చిన ఈ సినిమాకు క్రిస్టియన్ మోలినా దర్శకత్వం వహించారు. ఫ్రెంచ్ రచయిత్రి వాలెరీ టాస్సో రాసిన ‘డైరీ ఆఫ్ ఎ నింఫోమానియాక్’ అనే ఆత్మకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాలెరీ టాస్సో తన నిజ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను ఈ పుస్తకంలో రాశారు. ఆ తర్వాత ఆమె బార్సిలోనాలో సెక్స్ థెరపిస్ట్‌గా స్థిరపడ్డారు. వాలెరీ టాస్సో రాసిన నవల అప్పటికే ‘బెస్ట్ సెల్లర్’ కావడం వల్ల, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యూరోపియన్ దేశాలలో మంచి వసూళ్లనే సాధించింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటి బెలెన్ ఫాబ్రా తన నటనకు ప్రశంసలు అందుకోగా, హాలీవుడ్ దిగ్గజం చార్లీ చాప్లిన్ కుమార్తె గెరాల్డిన్ చాప్లిన్ ఈ చిత్రంలో వాలెరీ అమ్మమ్మగా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా apple tvలో అందుబాటులో ఉంది.

పోస్టర్ వివాదం

Advertisement

ఇక ఈ సినిమా విడుదల సమయంలో స్పెయిన్‌లో పెద్ద పోస్టర్ వివాదం రేగింది. ఒక మహిళ తన చేతిని లోదుస్తుల లోపల పెట్టుకుని ఉన్న సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందంటూ అక్కడి చర్చి సంస్థలు, కొన్ని మున్సిపాలిటీలు పబ్లిక్ ప్రదేశాలలో దీనిని ప్రదర్శించకుండా నిషేధించాయి. ఈ వివాదం వల్ల సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

వాలెరీ అనే ఒక అందమైన అమ్మాయికి చిన్నప్పటి నుంచే విపరీతమైన శృంగార కోరికలు ఉంటాయి. దీంతో ఆమె నచ్చిన వాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ విషయాలన్నీ తన డైరీలో రాసుకునే ఆమె, ఒకరోజు జైమ్ అనే ఒక పెద్ద బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడుతుంది. మొదట్లో అంతా బాగున్నా, పెళ్లి తర్వాత జైమ్ అసలు రంగు బయటపడుతుంది. వాలెరీని అనుమానిస్తూ, మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెడతాడు. చివరకు ఆమె గర్భవతి అయినప్పుడు కూడా దారుణంగా ప్రవర్తించడంతో, భరించలేక వాలెరీ ఆ నరకం నుండి బయటకు వచ్చేస్తుంది.

Advertisement

అలా ఒంటరిగా బయటకు వచ్చిన వాలెరీకి బతకడానికి ఎలాంటి దారీ కనిపించక, చివరకు హై-క్లాస్ వ్యభిచార కూపంలోకి అడుగుపెడుతుంది. అక్కడ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అయ్యే ఎంతోమంది మగవాళ్ల వికృత చేష్టలను, వాళ్ల అసలు బుద్ధిని కళ్లారా చూస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటుంది. ఒకానొక దశలో జీవితం మీద పూర్తిగా విరక్తి చెందిన వాలెరీ, ఇదంతా తన బలహీనత వల్లే జరిగిందని గ్రహిస్తుంది. చివరకు ఎలాగైనా సరే తన కోరికలను అదుపులో పెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరి ఆమె తన కోరికలను నియంత్రిస్తుందా ? కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా ? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోండి.

Read Also : నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×