E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..
Advertisement

Telugu Trailers: తెలుగు సినిమా రేంజ్ మార్కెట్ రోజురోజుకూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పుడు సినిమాల విజయాన్ని కేవలం థియేటర్ల కలెక్షన్లతోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో క్రియేట్ చేసే హైప్ రికార్డులతో కూడా కొలుస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో విడుదలయ్యే ట్రైలర్లకు వచ్చే వీక్షణలు, సృష్టించే రికార్డులు ఆయా సినిమాలపై ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతుంటాయి. ఈ నేపథ్యంలో, విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు సాధించి, టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన టాప్-3 తెలుగు సినిమాల ట్రైలర్ల ఏంటో తెలుసుకుందా. విశేషం ఏమిటంటే..ఇందులో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఉంది.

Read also-Brahmamudi Serial Today Episode May 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు 

ఆల్‌టైమ్ రికార్డుతో రామ్ చరణ్ ‘పెద్ది’

Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ‘పెద్ది’ సినిమా ట్రైలర్ మరోసారి నిరూపించింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 49 మిలియన్ల (49M) వీక్షణలను సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ (ATR) సృష్టించింది. రామ్ చరణ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజే ఈ స్థాయి వ్యూస్ రాబట్టడం ద్వారా టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది ‘పెద్ది’.

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు’. ఎపిక్ విజువల్స్‌తో కూడిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేసింది. పవన్ కళ్యాణ్ వీరోచిత నటన, కత్తి యుద్ధాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 47.02 మిలియన్ల (47.02M) వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో రెండో అత్యధిక వీక్షణలు సాధించిన ట్రైలర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాను ఈ రికార్డు మరోసారి చాటిచెప్పింది.

మూడో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ సెన్సేషన్ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. దీని తెలుగు వెర్షన్ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 44.67 మిలియన్ల (44.67M) వ్యూస్‌ను సొంతం చేసుకుని టాప్-3 స్థానంలో నిలిచింది. ‘పుష్ప రాజ్’ వైల్డ్ అండ్ మాస్ స్వాగ్, డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించడంలో ఈ ట్రైలర్ కీలక పాత్ర పోషించింది. అన్ని భాషల్లో కలిపి చూస్తే ఈ సినిమా వ్యూస్ మరింత భారీగా ఉండటం విశేషం.

Read also-Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి వెళ్లిపో రా.. సెంటిమెంట్ సీన్ తో కన్నీళ్లు.. శ్రీవల్లి సేఫ్..

ఈ టాప్-3 రికార్డులను పరిశీలిస్తే, మొదటి 24 గంటల వ్యూస్ పరంగా టాలీవుడ్‌లో మెగా హీరోల హవా స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల సినిమాలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో క్రియేట్ అవుతున్న ఈ రికార్డులు తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని మరియు అభిమానుల అంచనాలను మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ రికార్డులను బద్దలు కొట్టే క్రేజీ ప్రాజెక్ట్ ఏది వస్తుందో చూడాలి!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×