E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు 

Brahmamudi Serial Today Episode May 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode:  రాజు తన మాటలతో భ్రమరాంబను బోల్తా కొట్టించి కారు కీస్‌ తీసుకుని చూశావా… ఎలా తీసుకున్నానానో.. ఏంటి ఇందు కారు ఎలా వస్తుంది అన్నావు.. ఇదిగో ఇలా వస్తుంది. పద మన సూటుకు బూటుకు తగ్గట్టుగా రిచ్‌గా కారు ఎక్కి ఆఫీసుకు వెళ్దాం వెళ్లు కారెక్కు.. టాటా బైబై అత్తయ్య.. అంటూ కారు తీసుకుని వెళ్లిపోతారు. భ్రమరాంబ అయ్యో నా కారు.. నా కారు.. ఓరి వీడి దుంప తెగ కారేంటి అలా వేసుకుని వెళ్లాడు అంటూ తిడుతుంటే.. శేషు మాత్రం నేను అనుకుంటూనే ఉన్నానే ఏదో రకంగా వీడు మాయ చేస్తాడు అని అనగానే.. అవును మీరు అనుకుంటూనే ఉంటారు.. అయినా నడుము దగ్గర ఉన్న తాళం ఎలా చూశాడు వీడు.. అంటూ తిడుతుంటే.. వాడిని చూస్తుంటే.. దొంగలకు దొంగలా ఉన్నాడు భ్రమర.. గజదొంగలా కనిపిస్తున్నాడు. ముందు ఇంకా ఏం దోసుకుంటాడో ఏమో.. నువ్వు మదన్‌ను ఈ ఇంటి యువరాజులా చూడాలి అనుకున్నావు. కానీ ఆ దేవుడు ఎందుకో మరోలా స్ర్రిప్ట్‌ రాశాడు అనిపిస్తుంది అనగానే.. భ్రమరాంబ కోపంగా ఆపుతావా..? నువ్వు నీ అపశకునపు మాటలు అంటూ తిడుతుంది.

రాజు, ఇందులను చూస్తుంటే.. తనకు రాజ్‌, కావ్యలను చూసినట్టే ఉందని హ్యపీగా సుభాష్ తో  చెప్తుంది అపర్ణ. ముఖ్యంగా రాజు నా దగ్గరకు వచ్చినప్పుడు రాజ్‌, కావ్య వచ్చినప్పుడు మనసులో ఎలాంటి సంతోషం ఉండేదే అలాంటి సంతోషమే అనిపిస్తుంది అని చెప్పగానే.. సుభాస్‌ కూడా అవును అపర్ణ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి లాక్కుంటే మరొక రూపంలో ఇంకొకటి ఇస్తాడంటారు కదా..? రాజ్‌, కావ్యలను దూరం చేసిన దేవుడే తిరిగి వాళ్ల రూపంలో రాజు, ఇందులను ఇచ్చాడు అని చెప్తూ ఎమోషనల్‌ అవుతాడు. ఇన్ని రోజులు రేఖ, ఇందును ఎన్ని ఇబ్బందులు పెడుతుందోనని చాలా భయం వేసేది. కానీ ఇందు పక్కన ఈ అబ్బాయిని చూస్తే.. నాకు ధైర్యంగా అనిపిస్తుంది. ఆ దేవుడు వాళ్లకు అండగా ఉంటే అంతకు మించి మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి అంటూ అపర్ణ కూడా ఎమోషనల్ అవుతుంది.

Advertisement

ఆఫీసులో జీతాలు ఇవ్వడం లేదని వర్కర్స్‌ పెన్‌ డౌన్‌ చేస్తున్నారని తెలిసి రేఖ, శృతిని పిలిచి ఉద్యోగులను తిడుతుంది. అందరిని మీటింగ్‌ హాల్లోకి రమ్మని చెప్తుంది. అందరూ వచ్చాక రేఖ ఉద్యోగులను తిడుతుంది. మీకు నేను తప్ప వేరే దిక్కు ఉందా..? మీరు బయటకు వెళ్లి జాబ్‌ సంపాదిస్తారా..? మిమ్మల్ని నేను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టానంటే బయట మీకు ఎవ్వరూ జాబ్ ఇవ్వరు. అలా అని నన్ను బెదిరిస్తూ ఇక్కడే ఉన్నా మీకు శాలరీలు రావు.. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీకు ఇక్కడ సపోర్టుగా ఎవ్వరూ లేరు అని చెప్తుండగానే.. నేనున్నాను అంటూ రాజు, ఇందు వస్తారు. రాజును చూసిన రేఖ షాక్‌ అవుతుంది. కోపంగా ఇందుతో వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడగ్గానే.. నేను తీసుకురాలేదు ఆంటీ.. వాడే ఆఫీసుకు వెళ్దామని నేను వద్దంటే మా రహస్యం అందరికీ చెప్తానని బెదిరించాడు అందుకే వచ్చాము అని ఇందు చెప్తుంది.

ఇంతలో రాజు ఏంటి ఇక్కడ అంతా ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు అనగానే.. సుభాష్‌ కోపంగా గూడు పుఠాణి లేదు గుండు సూది లేదు.. స్టాఫ్‌కు ఇవ్వాల్సిన శాలరీ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పగానే.. రాజు       దానికి అంత టెన్షణ్‌ ఎందుకు నేను వచ్చేశాను. కదా ఇక నుంచి అన్ని మారిపోతాయి అంటూ చెప్పగానే.. రేఖ కోపంగా ఇక్కడ మేము ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే.. నువ్వు జోక్‌ చేస్తున్నావా… అంటుంది. దీంతో రాజు ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్‌ చేస్తాను అని చెప్పగానే.. రేఖ వెటకారంగా నవ్వుతూ నువ్వు సాల్వ్‌చేస్తావా..? అయితే చేసుకో..అంటూ రేఖ వెళ్లిపోతుంది. రేఖ వెళ్లిపోయాక రాజు, ఇందు ఎంప్లాయీస్‌తో మాట్లాడి వాళ్లను కన్వీన్స్‌ చేసి వర్క్‌ చేయడానికి ఒప్పిస్తుంది.

Advertisement

తర్వాత ఆంటోని రేఖను కలవడానిక ఆఫీసుకు వెళ్తాడు. ఆంటోనిని చూసిన రేఖ షాక్‌ అవుతుంది. దీంతో శృతి డౌటుగా అతన్ని చూసిన మేడం ఎందుకు కంగారు పడుతున్నారు. మమ్మల్ని ఎందుకు వెళ్లిపోమ్మంటున్నారు అని మనసులో అనుకుంటుంది. రేఖ, ఆంటోనిని తీసుకుని పక్కకు వెళ్లిన తిడుతుంది. ఆంటోని మాత్రం తనకు నెలకు లక్ష రూపాయలు ఇవ్వమని డిమాండ్‌ చేస్తాడు. దీంతో రేఖ ముందు లక్ష రూపాయలు ఇవ్వాలని తర్వాత ఎలాగైనా వాడిని వదిలించుకోవాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు సాయంత్రం భ్రమరాంబ తన కారు కోసం ఎదురుచూస్తుంటుంది.  రాజు కూడా ఇందును తీసుకుని చాలా స్పీడుగా వెళ్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×