Illu Illalu Pillalu Today Episode May 20th: బయటనుంచి రామరాజు గారు అని గట్టిగా ఒక మాట వినిపించగానే సాగర్ గొంతులాగే ఉంది అని అందరు కంగారు పడిపోతూ బయటికి వచ్చేస్తారు.. ఏంటి సాగరు పేరు పెట్టి పిలుస్తున్నాడేంటి అని అనుకుంటారు.. 5 లక్షలు ఇచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు కదా ఎక్కడ ఆయన అని వేదవతిని అడుగుతాడు.. వేదవతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా మీ నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తున్నావా అని అంటుంది.. రామరాజు రావడం చూసిన సాగర్ ఐదు లక్షలు కట్టి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు కదా అని రామరాజు మోహన ఐదు లక్షలు విసిరి కొడతాడు.. అయితే అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఐదు లక్షల నా మొహం కొట్టి వెళ్ళిపొమ్మని చెప్పారు కదా నా భార్యని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని సాగర్ అంటాడు.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు..
నీ మొహం పై డబ్బును విసిరి కొట్టేసాను.. నువ్వు అడిగిన ఐదు లక్షలు ఇదిగో.. చేతిలో డబ్బులు లేవని నన్ను ఎన్నోసార్లు అవమానించావు.. రైస్ మిల్లులో పనివాడిలాగా ఎన్నో రోజులు కష్టపడి పనిచేసిన కూడా నన్ను 500000 తీసిన దొంగ అని ఎన్నోసార్లు అవమానించావు.. ఈ డబ్బులు నీకు ఇచ్చేశాను ఇక నేను ఈ ఇంట్లో ఉండనే ఉండను అని సాగర్ అనగానే వేదవతి సాగర్ చంప పగలగొడుతుంది.. నువ్వు నా చెంప పగలగొట్టడం కాదు.. ఆరోజు మీ ఆయన ఐదు లక్షల కట్టాల్సిందే అని అన్నప్పుడు మీ ఆయన ఎందుకు అడగలేక పోయావు అని సాగర్ వేదవతికి దిమ్మతిరిగేలా షాక్ ఇస్తాడు. నేను ఇలా అనుకోలేదురా నువ్వు ఇలా ఇంట్లో ఉంటావని అనుకున్నానని వేదవది ఎంత చెప్పిన సరే సాగర్ మాత్రం అస్సలు వినడు.
ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేసాను కదా.. ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండను అని సాగర్ తెగేసి చెప్పేస్తాడు.. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అనగానే రామరాజు అస్సలు మాట్లాడకుండా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోరా అని అంటాడు. అ మాట వినగానే నర్మదా షాక్ అవుతుంది. అంతేకాదు శ్రీవల్లి ఆ మాట విని చాలా సంతోషంగా ఉంటుంది. భాగ్యం సంతోషానికి ఇంకా అవధులు లేవనే చెప్పాలి. అయితే నీ భార్యను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోరా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని రామరాజు అంటాడు. ఆ మాట విన సాగర్ చూసావా డబ్బులు వచ్చాయి కాబట్టి వెళ్లిపోని అన్నారు పద వెళ్దామని సాగర్ అంటాడు.
సాగర్ ఏంటి ఆవేశం ఎంత చెప్పినా సరే వినవేంటి అని నర్మదా బ్రతిమలాడుతున్న సరే సాగర్ మాత్రం తన కోపాన్ని తగ్గించుకోడు.. ఇకనుంచి వెళ్లి పోవాల్సిందే అని అంటాడు.. అయితే నేను చెప్పేది విను సాగర్ అని నర్మద ఎంత అన్నా సరే సాగర్ మాత్రం కోపాన్ని తగ్గించుకోకుండా ఆవేశపడుతూ ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు భర్త ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి.. నా మాట కాదని అంటే ఈ ఇంటితో పాటు నువ్వు కూడా నాకు అక్కర్లేదు అని చెప్పగానే నర్మదా మైండ్ బ్లాక్ అవుతుంది.. మాట మాట్లాడకుండా సాగర్ వెనకాలే వెళుతుంది..
ప్రేమ కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అవుతుంది.. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా కారు డ్రైవింగ్ నేర్చుకొని ఏం చేయాలి అని అడుగుతాడు ధీరజ్.. ఆ ఫైనన్స్ ఇయర్ చెప్పిన విషయం నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు.. అతను లోన్ ఇవ్వడానికి ముందు ఈఎంఐ కరెక్ట్ గా కట్టకపోతే ఎత్తుకొస్తామో అని అన్నారు కదా అది నాకు గుర్తుంది. నువ్వు భోజనానికి వచ్చిన లేదంటే నీ ఆరోగ్యం బాగా లేకపోయినా సరే నేను కారుని నడిపి ఆ డబ్బుల్ని సేవ్ చేస్తాను అని ప్రేమ అనగానే ధీరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ డ్రైవింగ్ చేస్తూ మనుషుల్ని గుద్దేస్తుంది. తనకి డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కోరికని తీరుస్తాడు.
ప్రేమకు ధీరజ్ డ్రైవింగ్ నేర్పిస్తున్న సమయంలో నర్మదా సాగర్ కి ఎంత చెప్పినా వినడం లేదు.కచ్చితంగా ధీరజ్ ఉంటే ఏదో ఒకటి చేస్తాడు అని తనకి ఫోన్ చేసి నిజం చెప్పేస్తుంది. పెద్ద గొడవ జరిగింది ధీరజ్ నువ్వెక్కడున్నావ్ వెంటనే ఇంటికి రా మీ అన్నయ్య ఎవరి మాట వినడం లేదు అని అనగానే సరే వదిన నువ్వు ఏమి కంగారు పడకు నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు. ప్రేమని పక్కకు రమ్మని చెప్పి ధీరజ్ కారు డ్రైవింగ్ చేస్తాడు.
రామరాజు వేదవతి అలాగే అమూల్య తిరుపతి అందరూ ఒకే చోట ఉండి సాగర్ ఎవరి మాట వినడం లేదు. వాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. వాడిని ఆపే ప్రయత్నం చేయండి మీరు అని వేదవతి అంటే.. బుజ్జమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న కోరిక వాడి కలిగినప్పుడు నేను ఎంత ఆపాలని బ్రతిమలాడినా సరే వాడు నా మాట వినడు.. నా చేతిలో ఏముంది నువ్వే చెప్పు అని రామరాజు అంటాడు. బావ నువ్వే అలా అంటే ఎలా బావ వాడు ఆవేశంలో ఉన్నాడు. ఇన్ని రోజులు పెంచుకున్న కొడుకుని వదిలేస్తావా? ఏదో ఒకటి చెప్పి నచ్చచెప్పు బావ అని తిరుపతి కూడా అంటాడు .
శ్రీవల్లి భాగ్యం అలాగే ఆనందరావు సుకన్య గదిలో తలుపు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. దేవుడనే వాడు ఉన్నాడు అందుకే నా మొర ఆలకించాడు అని శ్రీవల్లి ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది.. మనలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడని నువ్వు చెప్పావు కదా నేను నమ్మలేదు ఇప్పుడు అది నిజమే అని నాకు అర్థం అవుతుంది అని శ్రీవల్లి అంటుంది.. ఆ సాగర్ ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి నేనే కారణమని భాగ్యం అంటుంది. రావు తో మాట్లాడిన మాటలు గురించి చెప్పడంతో శ్రీవల్లిని బుర్రె బుర్రమ్మ నువ్వు చేయడంవల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఏది ఏమైనా సరే సాగర్ వెళ్ళిపోతున్నాడు అని శ్రీవల్లి నర్మదా బయటకు పోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ సాగర్ ని ఆపుతాడా? శ్రీవల్లి కడుపు బండారం బయటపడుతుందా అన్నది చూడాలి..