E-Paper
Advertisement

మళ్లీ వాయిదా పడనున్న యశ్ టాక్సిక్.. వారితో విభేదాలే కారణమా? ఒక్క మాటతో క్లారిటీ!

మళ్లీ వాయిదా పడనున్న యశ్ టాక్సిక్.. వారితో విభేదాలే కారణమా? ఒక్క మాటతో క్లారిటీ!
Advertisement

Toxic Movie:ఒకప్పుడు సీరియల్స్ , ప్రకటనల ద్వారా కెరియర్ మొదలుపెట్టిన కన్నడ హీరో యశ్..ఆ తర్వాత నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 1&2 చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించారు. కానీ మళ్లీ ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడడానికి కారణం ఈ చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్స్ తో విభేదాలే అంటూ ఒక వార్త జోరుగా వినిపించింది. అయితే దీనికి చిత్ర బృందం ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు.

రూమర్స్ కి చెక్ పెట్టిన చిత్ర బృందం..

అసలు విషయంలోకి వెళ్తే.. కమర్షియల్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ టాక్సిక్ సినిమా మార్చి 19వ తేదీ నుండి జూన్ 4వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే మరోసారి వాయిదా పడనుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ వార్తలను చిత్ర బృందం ఖండించింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అంటూ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లు స్పష్టం చేసింది.అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు.అమెరికాలో జరుగుతున్న సినిమాకాన్ కార్యక్రమానికి హీరో యశ్ తో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి ఇద్దరూ హాజరు కాబోతున్నారు.

ఐదు మంది హీరోయిన్స్..

Advertisement

ఇకపోతే టాక్సిక్ తో పాటు యశ్ మరో చిత్రం రామాయణ గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో టాక్సిక్ వాయిదా వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు.పైగా ఇందులో ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎలిజిబెత్ పాత్రలో హుమా ఖురేషి, గంగ పాత్రలో నయనతార, రెబెకా పాత్రలో తారా సుతారియా అలరించనున్నారు. ఇక రుక్మిణి వసంత్ మెలిసా అనే పాత్రలో ఆకట్టుకోబోతున్నారు.

also read:Tumbbad 2: ఇండియాస్ బిగ్గెస్ట్ హర్రర్ ఫిలిం.. షూటింగ్ ప్రారంభం.. రిలీజ్ ఎప్పుడంటే?

టాక్సిక్ సినిమా విశేషాలు..

Advertisement

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు . పైగా ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు.. సుమారుగా 800 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం ఇండియాలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. 1940 – 70 నాటి గోవా నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. తన మాస్ పర్ఫామెన్స్ తో హై వోల్టేజ్ తో అందరినీ ఆకట్టుకునే యశ్.. ఈసారి అంతకుమించి ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. మరి యశ్ కి ఈ టాక్సిక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×